మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Oct 08, 2020 , 03:29:50

బంధువుల ఇంటికే కన్నం

బంధువుల ఇంటికే కన్నం

  • మరో ముగ్గురితో కలిసి చోరీ
  •  అరెస్టు చేసి, సొత్తును స్వాధీనం  చేసుకున్న పోలీసులు 

వరంగల్‌ క్రైం/హసన్‌పర్తి: బంధువుల ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడితోపాటు మరో ముగ్గు రిని హసన్‌పర్తి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి  నుంచి రూ. 4,50,000 నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నా రు. ఈ మేరకు కాజీపేట ఏసీపీ రవీందర్‌ వివరా లు వెల్లడించారు. హన్మకొండకు చెందిన బూరం శివకుమార్‌, సయ్యద్‌ ఇమ్రాన్‌, కుప్పె రాహుల్‌, బాలుడి మధ్య స్నేహం కుదిరి జల్సాలకు అలవా టు పడ్డారు. డబ్బులు లేకపోవడంతో చోరీలు చేయాలని నిర్ణయించుకుని బూరం శివకుమార్‌ సూచన మేరకు ఆరెపల్లిలో నివాసముంట్నున తన బంధువు జంగా కుమారస్వామి ఇంట్లో చోరీ చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో గత నెల 9న ఆరెపల్లిలోని కుమారస్వామి ఇంట్లో శివకు మార్‌తోపాటు మరో ముగ్గురు కలిసి రూ. 4,50,000లను చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆధునిక టె క్నాలజీ సహాయంతో నిందితులను గుర్తించి బుధ వారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరా న్ని ఒప్పుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తుతోపా టు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసు కుని అరెస్టు చేశారు. కాగా నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన హసన్‌పర్తి ఇన్‌స్పె క్టర్‌ శ్రీధర్‌రావు, ఎస్సైలు రాజ్‌కుమార్‌, రవీందర్‌ ను ఏసీపీ అభినందించారు.  logo