గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Oct 08, 2020 , 03:30:07

పేదలపై కేంద్రం నిర్లక్ష్యం

పేదలపై కేంద్రం నిర్లక్ష్యం

  • దేశమంతా తెలంగాణవైపు చూస్తున్నది
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం
  • వరంగల్‌లో మాస్టర్‌ ప్లాన్‌ అమలు
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌
  •  గ్రాడ్యుయేట్‌ ఓటర్లను నమోదు చేయించాలని కార్యకర్తలకు పిలుపు
  • మోడీని ఢీకొనే నేత కేసీఆర్‌ ఒక్కరే
  • మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
  •  చీఫ్‌విప్‌ దాస్యం అధ్యక్షతన వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

దేశంలో పేదలపై మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ అధ్యక్షతన హన్మకొండలోని మయూరి గార్డెన్‌లో బుధవారం నిర్వహించిన వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బోయినపల్లి మాట్లాడుతూ ఇంటింటికీ తిరిగి గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని కార్యకర్తలకు పిలుపునిస్తూనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు.

  హన్మకొండ, అక్టోబర్‌ 7: పేదలపై మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. హన్మకొండ నిట్‌ సమీపంలోని మయూరి గార్డెన్‌లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అధ్యక్షతన జరిగిన వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి బోయినపల్లి, మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ వరంగల్‌ నగరం ఉద్యమ స్ఫూర్తిని కలిగించడంతోపాటు చైతన్యవంతమైన మేధావి వర్గం ఉన్నదని అన్నారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పట్టభద్రుల్లో ఆసక్తి, అవగాహన కల్పించాలని అన్నారు. వరంగల్‌ నగరం అభివృద్ధికి రూపొందించిన కొత్త మాస్టర్‌ప్లాన్‌ సైతం అమలు కానుందన్నారు. మేధావులు, యువత ఉండే పట్టణ పరిధిలో పార్టీని ఆదరించే వారు లేరనే అపవాదును కొందరు క్రియేటివ్‌ చేస్తున్నారని, దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బీజేపీ జాతీయవాదాన్ని రేకెత్తించి మోడీ ప్రభుత్వం యువతను పక్కదారి పట్టిస్తుందన్నారు. ప్రధానమంత్రిగా దేశానికి ఒరుగబెట్టిందేమీ లేదన్నారు. యువత, మేధావి వర్గం ఉండడంతోనే టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంత బలంగా ఉందన్నారు. ఇతర పనుల్లో ఉన్న గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని అ న్నారు. రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని అన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అ భ్యర్థి భారీ మెజారిటీతో గెలువడం ఖాయమన్నారు. 

ప్రధానిని ఢీకొనేది ఒక కేసీఆరే : మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

 మోడీని ఎదుర్కొనే శక్తి కేసీఆర్‌కే ఉందని మాజీ ఉపముఖ్య మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. పట్టభద్రుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి బలం లేదని అనుకోవడం ఒక అపోహేనన్నారు. ఏ ఎన్నిక వచ్చినా టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని, కరెక్ట్‌గా సభ్యత్వ నమోదు చేయిస్తే అఖండ విజయం తథ్యమని పేరొన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉనికి లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందుతున్నాయని వివరించారు. ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ముందుగానే భరోసా ఇచ్చిన మహనీయుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. మోడీ ప్రభుత్వంలో దళితులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ర్టానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలను సైతం ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. సంస్కృతి, సభ్యత మర్చిపోయి కొందరు స్థాయికి మించి సీఎం కేసీఆర్‌పై అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకన్న, టీఆర్‌ఎస్‌ నాయకులు సుందర్‌రాజ్‌యాదవ్‌, బొర్ర ఐలయ్య, జనార్దన్‌గౌడ్‌, కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఎన్నికలో టీఆర్‌ఎస్‌దే విజయం


ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయం. ప్రతిపక్షాల మాటలను పట్టభద్రులు విశ్వసించడం లేదు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాలకు అందుతున్నాయి. పేదల ఇబ్బందులు తొలగించేందుకు సీఎం కేసీఆర్‌ ఎల్‌ఆర్‌ ఎస్‌ను అమలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో సైతం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదు. ఇంత చేస్తున్నా ప్రభుత్వంపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పట్టభద్రుల ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలి. మేధావులు, యువత లేరని కొం దరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఏ పార్టీకి లేనటు వంటి నెట్‌ వర్క్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థికి భారీ మెజారిటీని ఇచ్చి గెలిపించాలి. 

- రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ 

ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు


ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు. ఇందుకు గత ఎన్నికలే ఉదాహరణ. నగరంలో సీఎం కేసీఆర్‌, కేటీఆ ర్‌ సూచనల మేరకు ప్రతి డి విజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంత్రులు కేటీఆర్‌, తదిత రులు ఎంజీఎంలో కరోనా వార్డుకు వెళ్లి బాధితులకు అందిస్తున్న చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాం గ్రెస్‌ నాయకులు ఎందుకు ఎంజీఎంకు వెళ్లలేదు? ప్రపం చం లో ఎక్కడ లేనివిధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ అభ్యర్థి ని భారీ మెజారిటీతో గెలిపించి ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలి.

- వరంగల్‌ నగర మేయర్‌ గుండాప్రకాశ్‌రావు 

logo