శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Oct 05, 2020 , 06:07:03

ప్రశాంతంగా ముగిసిన యూపీఎస్‌సీ పరీక్ష

ప్రశాంతంగా ముగిసిన యూపీఎస్‌సీ పరీక్ష

  • పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు

హన్మకొండ, అక్టోబర్‌ 4 : సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, పరీక్షల పరిశీలకుడు, రాష్ట్ర ఉపాధి కల్పన శిక్షణ శాఖ డైరెక్టర్‌ కేవై నాయక్‌, యూపీఎస్‌సీ సెక్షన్‌ అధికారి ఎస్‌హెచ్‌ ఘింఖాన్సియం టంబింగ్‌ పరిశీలించారు. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు జయ నర్సింగ్‌, గాయత్రి, ఎల్‌బీ, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను పరిశీలించగా, కేవై నాయక్‌ ఎస్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, వాగ్దేవి, శ్రీ అరుణోదయ, ఎస్‌వీఎస్‌ గ్రూప్‌ కళాశాలలు, పద్మావతి, చైతన్య ఇంజినీరింగ్‌ కళాశాల, వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలను పరిశీలించారు. సాయంత్రం ఎస్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, అరవింద, ఎల్‌బీ, సీకేఎం, తాళ్ల పద్మావతి, వాగ్దేవి, మాస్టర్జీ కళాశాలలను కలెక్టర్‌ పరిశీలించారు. కాగా, వరంగల్‌ నగరంలోని 16 సెంటర్లలో ఉదయం జరిగిన పరీక్షకు 6758 మందికి 3330(49.3 శాతం) మంది, సాయంత్రం జరిగిన పరీక్షకు 3301 (48.8శాతం)మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్‌ వెంట డీఆర్‌డీవో శ్రీనివాస్‌కుమార్‌, డీఈవో నారాయణరెడ్డి, డీఆర్‌వో వాసుచంద్ర, సెంటర్‌ పరిశీలన  అధికారులు తహసీల్దార్‌ కిరణ్‌ప్రకాశ్‌, రాజేశ్‌, ఎంపీడీవో జవహర్‌రెడ్డి, భాస్కర్‌, డీటీ శర్మ, షేక్‌ అనిఫ్‌పాషా, రెవెన్యూ అధికారు లు తదితరులు ఉన్నారు.logo