గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Oct 05, 2020 , 06:01:07

పోచమ్మకుంటలో రియల్టర్‌ కిడ్నాప్‌

 పోచమ్మకుంటలో రియల్టర్‌ కిడ్నాప్‌

వరంగల్‌ క్రైం, అక్టోబర్‌ 4 : పొచమ్మకుంటకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఈర ప్రశాంత్‌ను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేసినట్లు హన్మకొండ పొలీసులు తెలిపారు.  వారి కథనం ప్రకారం... పోచమ్మకుంటలో నివాసం ఉంటున్న ఈర ప్రశాంత్‌ హైదరాబాద్‌కు చెందిన విశాల్‌రెడ్డి, విశ్వ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. లావాదేవీల్లో తేడా రావడంతో ప్రశాంత్‌కు, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే వారు ఇంట్లోకి చొరబడి ప్రశాంత్‌ను కిడ్నాప్‌ చేశారన్నారు. ప్రశాంత్‌ సొదరుడు రమేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.