శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Oct 05, 2020 , 06:01:04

బార్‌లో కాలం చెల్లిన బీర్ల అమ్మకాలు

 బార్‌లో కాలం చెల్లిన బీర్ల అమ్మకాలు

వరంగల్‌ క్రైం : ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయ సమీపంలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో కాలం చెల్లిన బీర్లు అమ్ముతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆదివారం ఓ వ్యక్తి పెట్టిన పోస్టు సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. సర్క్యూట్‌ హౌస్‌ రోడ్డులోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం సమీపంలో బార్‌లో ఆదివారం ఓ వ్యక్తి ఓ బీరును కొనుగోలు చేశాడు. కాలం చెల్లిన బీరు ఎందుకిచ్చావని కౌంటర్‌లోని వ్యక్తిని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించాడని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. సోషల్‌ మీడియాలో పోస్టును చూసి ఎక్సైజ్‌ ఎస్సై బాలకిషన్‌ సదరు బార్‌ను సందర్శించి కాలం చెల్లిన బీర్లను సీజ్‌ చేశారు.