శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Oct 05, 2020 , 05:53:39

టూరిజం స్పాట్లలో సండే సందడి

 టూరిజం స్పాట్లలో సండే సందడి

  • కిటకిటలాడుతున్న పర్యాటక ప్రాంతాలు
  • కళకళలాడుతున్న బొగత, లక్నవరం, రామప్ప, జూపార్కు, వరంగల్‌ కోట

ఉమ్మడి జిల్లాలో ‘పర్యాటకం’ కళకళలాడుతున్నది. కరోనాతో ఆరు నెలలకు పైగా టూరిస్టు స్పాట్లను మూసివేయడంతో ఆ ప్రాంతాలన్నీ బోసిపోయాయి. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పర్యాటకానికి అనుమతినివ్వడంతో మొదటి ఆదివారం పర్యాటక ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన ములుగు జిల్లాలోని బొగత జలపాతం, లక్నవరం సరస్సు, రామప్ప ఆలయం, హన్మకొండలోని జూపార్కు, వరంగల్‌ కోట సందర్శకులతో కిటకిటలాడాయి. పర్యాటకుల రాకతో బొగత జలపాతం పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. లక్నవరం సరస్సులో తీగల వంతెనపై నడుస్తూ.. బోటింగ్‌ చేస్తూ సరదాగా గడిపారు. రామప్పలోని రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. జూపార్క్‌లోని పక్షులు, జంతువుల వద్ద సెల్ఫీలు దిగుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఖిలా వరంగల్‌లో శిల్ప సంపదను చూసి ముగ్ధులయ్యారు. అధికారులు కొవిడ్‌ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి, శానిటైజర్‌ చల్లి, మాస్క్‌ ఉంటేనే అనుమతించారు.


logo