బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-city - Oct 03, 2020 , 02:30:59

వీధి వ్యాపారులకు చేయూతనిస్తాం

వీధి వ్యాపారులకు చేయూతనిస్తాం

  • మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు

రెడ్డి కాలనీ : వీధి వ్యాపారులకు చేయూతనందిస్తామని బల్దియా మేయర్‌ డాక్టర్‌ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. 39వ డివిజన్‌ లష్కర్‌బజార్‌లో వీధి వ్యాపారుల సంక్షేమం కోసం ఇటీవల నిర్మించిన 25 వెండింగ్‌ యూనిట్లను చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, కమిషనర్‌ పమేలా సత్పత్తితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఇక్కడ మేయర్‌ మాట్లాడుతూ వీధి వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని చెప్పారు. ఇందులో భాగంగానే వెండింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నదని,  ఈ ప్రక్రియ దశలవారీగా కొనసాగుతుందని చెప్పారు. చీఫ్‌విప్‌ దాస్యం మాట్లాడుతూ కేటాయించిన షెల్టర్లలోనే విధిగా వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రాజెక్టు డైరెక్టర్‌ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తారని, వ్యాపారులు గుర్తింపుకార్డులను వెంట ఉంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్‌, చింతల యాదగిరి, ప్రాజెక్టు డైరెక్టర్‌ భద్రునాయక్‌, డీఎంసీ రజితారాణి, ఏడీఎం సీ సతీశ్‌, టీఎంసీ రమేశ్‌, సీవో సఫియా సుల్తానా పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతికి వినయ్‌భాస్కర్‌ బాసట

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో నిరుపేద నిరుద్యోగులకు ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ బాసటగా నిలుస్తున్నారు. సాయం కోరి వచ్చిన యువతికి కొండంత భరోసా ఇచ్చారు. సొంత ఖర్చుతో నిర్మించిన స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్‌లో యువతితో విజయ డెయిరీ స్టాల్‌ను ఏర్పాటు చేయించారు. హన్మకొండకు చెందిన కాముని మౌనిక ఎంబీఏ పూర్తి చేసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తనకు సాయం చేయాలని దాస్యంను కలిసి విజ్ఞప్తి చేసింది. వెంటనే ఆయన స్పందించి విజయ డెయిరీ పదార్థాల స్టాల్‌ను ఏర్పాటు చేయించారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా మేయర్‌ ప్రకాశ్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి చేతులమీదుగా ఈ స్టాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్‌కు మౌనిక ధన్యవాదాలు తెలిపింది. ఇక్కడ డెయిరీ డీడీ ప్రదీప్‌, టీఆర్‌ఎస్‌ నా యకుడు పులి రజినీకాంత్‌ పాల్గొన్నారు. 


logo