శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Oct 03, 2020 , 02:31:01

అమాత్యుడికి ఘన సన్మానం

అమాత్యుడికి ఘన సన్మానం

  • ‘స్వచ్ఛభారత్‌ మిషన్‌'లో రాష్ర్టానికి   అవార్డుపై ప్రజాప్రతినిధుల హర్షం
  • మంత్రి ఎర్రబెల్లిని సత్కరించిన  ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం

హన్మకొండ, అక్టోబర్‌ 2: కేంద్ర ప్రభుత్వం ప్రక టించిన స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అవార్డుల్లో తెలంగా ణ రాష్ర్టానికి ఒకటి, కరీంనగర్‌ జిల్లాకు 3వ స్థానం రావడానికి కృషి చేసిన అమాత్యుడు దయాకర్‌రా వును ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ శుక్రవారం హన్మకొండ లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లిని స త్కరించారు. ఈ సందర్భంగా చీఫ్‌ విప్‌ మాట్లాడు తూ సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశంలో దయాకర్‌రావు కు ఇచ్చిన  శాఖలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. వారి పని తీరుకు నిదర్శనమే ఈ అ వార్డులన్నారు. మంత్రి దయన్న బంగారు తెలం గాణ సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నార ని అన్నారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు స న్మానించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అవార్డులు రావడానికి సహకరించిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపా రు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఇండ్ల నాగేశ్వర్‌రావు ఉన్నారు. చండీయాగానికి హాజరైన ఎర్రబెల్లిప్రశాంత్‌నగర్‌లోని తన ఇంట్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ నిర్వహించిన చండీయా గానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు.

‘పల్లె ప్రగతి’తో మెరుగైన వసతులు

వర్ధన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌ రావుతో కలిసి పల్లెప్రగతిలో నిర్మించిన డంపింగ్‌ యార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ ఆరెల్లి స్రవంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈజీఎస్‌ నిధులతో తెలంగాణలో ప్రజల అవసరాలను గుర్తించి పనులు చేశామన్నారు.

డంపింగ్‌ యార్డుల నిర్మాణంతో గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పల్లెలు పరిశుభ్రంగా మారాయన్నారు. సర్పంచ్‌లు, కార్యదర్శులు బాధ్యతగా వ్యవహరిస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. దీంతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ప్రజాప్రతినిధులకు కూడామంచి పేరు వస్తుందని ఆయన వివరించారు. విధుల పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వ్యవహరించినా ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజేశ్‌ఖన్నా, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు