శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Oct 02, 2020 , 06:10:16

కూడళ్లకు కొత్తందం

కూడళ్లకు కొత్తందం

  • నయా లుక్‌తో నగర జంక్షన్లు
  • సరికొత్త అందాలతో కనువిందు
  • కుడా ఆధ్వర్యంలో సుందరీకరణ
  • ప్రసూతి వైద్యశాల ఎదుట ఆకట్టుకుంటున్న తల్లీబిడ్డల విగ్రహం

వరంగల్‌ : చారిత్రక నగర కూడళ్లు కొత్తందాలను సంతరించుకుంటున్నాయి. వివిధ కళాకృతు లు, మనుషుల జీవిన శైలికి అద్దం పట్టేలా జంక్షన్లలో ఏర్పాటు చేసిన విగ్రహాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో జంక్షన్ల సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రూ.1.50 కోట్లతో హన్మకొండ బస్‌స్టేషన్‌ జంక్షన్‌ సుందరంగా ముస్తాబైంది. ‘స్మార్ట్‌సిటీ’లో భాగంగా వరంగల్‌ నగరంలోని హన్మకొండ బస్‌స్టేషన్‌, హం టర్‌ రోడ్డు సీఎస్‌ఆర్‌ గార్డెన్‌ జంక్షన్‌, కేయూ జంక్షన్‌లో కుడా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి న కళాకృతులు, వివిధ రకాల బొమ్మలు కొత్తశోభను తెచ్చాయి.  

హన్మకొండలో తల్లీబిడ్డల విగ్రహం

హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల ఎదుట ఏర్పాటు చేసిన తల్లీబిడ్డల విగ్రహం ఆకట్టుకుంటు న్నది. వరంగల్‌ నగరంలో పేరున్న ఈ వైద్యశాల ముందు భాగంలో పెట్టిన  ఈ విగ్రహం సెంటర్‌కు ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఇప్పటికే కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలోని వనితా వనంలో ఏర్పా టుచేసిన తల్లీబిడ్డల విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటున్నది. సీఎస్‌ఆర్‌ గార్డెన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విగ్రహాలు మనిషి జీవన విధానాన్ని తెలియజేసేలా ఉన్నాయి. మరో వారంలో విగ్రహాలకు రం గులు వేసే పనులు పూర్తి చేయనున్నారు. కేయూ సెంటర్‌లో రాతిపై మనిషి విగ్రహాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఫౌంటేన్‌, గ్రీనరీ, అందమైన పూల మొక్కలు, జిరాఫీ బొమ్మలతో హన్మకొండ బస్టాండ్‌ జంక్షన్‌ చూపరులను కట్టిపడేస్తున్నది. కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం ఎదుట రూ.10లక్షలతో అభివృద్ధి చేసిన పోతన జంక్షన్‌ స్పె షల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఎంజీఎం గోడను ఆనుకొని ఉన్నస్థలంలో బమ్మెర పోతన విగ్రహం, లైటింగ్‌తో ఈ ప్రాంతం జిగేల్‌ మంటోంది. ఫాతిమా జంక్షన్‌లోని ‘వావ్‌ జంక్షన్‌' నగరవాసులను అబ్బురపరుస్తున్నది. 

దశల వారీగా మరిన్ని.. 

నగరంలోని మరిన్ని జంక్షన్లను దశలవారీగా సుందరీకరించేందుకు కుడా ప్రణాళికలు రూపొందిస్తున్నది. స్మార్ట్‌సిటీలో భాగంగా నగరానికి నాలుగు గ్రాండ్‌ ఎంట్రెన్స్‌లు నిర్మించాలని నిర్ణయించింది. నగర ముఖద్వారాలు గ్రాండ్‌ వెల్‌కం పలికేలా, నగరంలోకి వచ్చాక జంక్షన్లు చారిత్రక నగర విశిష్టతను తెలిపేలాఅభివృద్ధి చేసేందుకు ముందుకుపోతున్నది. 


logo