శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Sep 28, 2020 , 02:13:58

పర్యాటక రంగానికి ప్రాధాన్యత

పర్యాటక రంగానికి ప్రాధాన్యత

  • రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

హన్మకొండ, సెప్టెంబర్‌ 27 : రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి  అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హన్మకొండ పద్మాక్షి కాలనీలోని అగ్గలయ్య గుట్టను సందర్శించి కుడా చైర్మ న్‌ మర్రి యాదవరెడ్దితో కలిసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. వరంగల్‌ నగరం ఎన్నో చారిత్రక ఆధారాలకు నిలయం అన్నారు. ఇక్కడ ఇన్ని చారిత్రక కట్టడాలు ఉన్న విషయం గతంలో చాలా మందికి తెలియదని, కనీసం గుట్టపైకి వెళ్లేందుకు దారి లేకపోవడంతో మరుగునపడిందన్నారు.

నాగార్జునసాగర్‌ వద్ద ఉన్న బుద్ధ వనం తరహాలో ఇక్కడ ఉన్న జైన వనాన్ని తీర్చిదిద్దాలనే ఉద్ధేశంతో రెండేళ్ల క్రితం తాను స్వయంగా గుట్టపైకి వచ్చినట్లు తెలిపారు. బుద్ధుడి ఆనవాళ్లు ప్రపంచానికి తెలియజేసేలా గుట్ట అభివృద్ధికి రూ.1.3 కోట్లు కేటాయించి అభివృద్ధి చేసినట్లు చెప్పారు. త్వరలోనే ఈ కట్టడాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్‌ ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కుడా ప్లానింగ్‌ అధికారి అజిత్‌రెడ్డి, డీఈ వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు. 


logo