శుక్రవారం 23 అక్టోబర్ 2020
Warangal-city - Sep 28, 2020 , 02:13:58

యోగా జీవితంలో భాగం కావాలి

యోగా జీవితంలో భాగం కావాలి

  • గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి

వరంగల్‌/ వరంగల్‌ కల్చరల్‌ : యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ యోగాసనాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పరిపూర్ణ ఆరోగ్యానికి ప్రతి ఒక్క రూ యోగా చేయాలన్నారు.  ప్రాచీన కాలం నుంచి మన దేశంలో  యోగా ఉందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం భారతదేశ యోగా, ఆ రోగ్య సూత్రాలను ప్రశంసించిందన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి మాట్లాడుతూ సోమవారం ఖిలావరంగల్‌లో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహిస్తున్న ట్లు చెప్పారు. దీంతో పాటు విద్యార్థులకు గ్రామీణ పర్యాటకంపై ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నామన్నారు.

వ్యాసాన్ని వాట్సాప్‌కు పంపిస్తే ఉత్తమ వ్యాసాలకు ప్రశంసాపత్రాలు పంపిస్తామని అన్నారు.  ఈ కార్యక్రమంలో యోగా గురువు శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ మాధవీలత, పర్యాటక శా ఖ డీఈ ఏకాంబరం, హరిత కాకతీయ మేనేజర్‌ అశోక్‌రెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌ మదన్‌మోహన్‌, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ పీఆర్వో కిరణ్మయి, రెడ్‌క్రాస్‌ వలంటీర్‌ ఈవీ కార్తీక్‌రావు, సాత్విక, మాగంటి సిరిజ, అక్షిత, అనుభవ్‌, భువన్‌ సింగ్‌, పర్యాటక శాఖ సిబ్బం ది పాల్గొన్నారు.


logo