బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-city - Sep 26, 2020 , 02:33:18

ఎల్‌ఎల్‌బీ, బీటెక్‌ పరీక్షలు ప్రారంభం

ఎల్‌ఎల్‌బీ, బీటెక్‌ పరీక్షలు ప్రారంభం

కేయూ క్యాంపస్‌, సెప్టెంబర్‌ 25 : కేయూ ఎల్‌ఎల్‌బీ మూడు, ఐదేళ్ల చివరి సెమిస్టర్‌ పరీక్షలు, బీటెక్‌ నాలుగో ఏడాది చివరి సెమిస్టర్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభమైనట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ ఎస్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ పరీక్షకు 438 మంది విద్యార్థులకు 415 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ పరీక్షకు 51 మంది అభ్యర్థులకు 47 మంది, బీటెక్‌ పరీక్షలకు 1066 మందికి 1051 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. వివిధ పరీక్షా కేంద్రాలను అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఎం సురేఖ, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పీ మల్లారెడ్డితో కలిసి మహేందర్‌రెడ్డి పరిశీలించారు. 

పరీక్షా కేంద్రం తరలింపు..

కేయూ పరిధిలోని కేసముద్రం మహర్షి డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని మహబూబాబాద్‌ గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాలకు తరలిస్తూ వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ ఎస్‌ మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 28 నుంచి జరిగే డిగ్రీ పరీక్షలకు విద్యార్థులు మహబూబాబాద్‌ పరీక్షా కేంద్రంలో హాజరవ్వాలని సూచించారు. 


logo