శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Sep 25, 2020 , 05:05:02

ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి

ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి

  • చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ 

వరంగల్‌స్పోర్ట్స్‌ : ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిట్‌ ఇండియా ఫ్రీడం రన్‌ను మేయర్‌ గుండా ప్రకాశ్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. యోగా, వ్యాయామం, క్రీడలు అందరి జీవితంలో భాగం కావాలన్నారు. క్రీడల్లో రాణించాలంటే ఫిట్‌నెస్‌ అవసరమన్నారు. ఆరోగ్య భారత్‌ కోసం అందరూ ముందుకు రావాలన్నారు. ఫిట్‌ ఇండియాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. మేయర్‌ మాట్లాడుతూ.. చిన్న నాటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. ఫిట్‌నెస్‌తో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్‌, సునీల్‌, క్రీడా శాఖ అధికారులు అశోక్‌, ధనలక్ష్మి, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.