సోమవారం 26 అక్టోబర్ 2020
Warangal-city - Sep 25, 2020 , 05:04:59

ఎస్‌ఐ మహేందర్‌పై లైంగిక దాడి కేసు

ఎస్‌ఐ మహేందర్‌పై లైంగిక దాడి కేసు

సుబేదారి : పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఎస్‌ఐ దుర్గం మహేందర్‌పై వరంగల్‌ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేయగా అతడిపై లైంగికదాడి కేసు నమోదైంది. రెండేళ్ల కిత్రం ఇదే స్టేషన్‌లో మహేందర్‌ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లికి చెందిన యువతి కాజీపేటలోని మెడికల్‌ షాప్‌లో పని చేసేది. ఆ క్రమంలో ఇద్దరికీ ఫోన్‌లో పరిచయమై, చనువు ఏర్పడింది. సదరు యువతి తనను పెళ్లిచేసుకోవాలని ఎస్‌ఐ మహేందర్‌ను పలుమార్లు కోరగా నిరాకరించాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆమె రెండు రోజుల క్రితం సుబేదారి ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మహేందర్‌పై  417, 420, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ అజయ్‌ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎస్‌ఐ మహేందర్‌ సుబేదారి స్టేషన్‌ నుంచి ఆరు నెలల క్రితం మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు, ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా రామగుండం స్టేషన్‌కు బదిలీ అయ్యారు.  


logo