శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Sep 24, 2020 , 06:10:55

అక్టోబర్‌ 8 నుంచి కేయూ పీజీ పరీక్షలు

అక్టోబర్‌ 8 నుంచి కేయూ పీజీ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ రెండో సంవ త్సరం, సెరికల్చర్‌, ఎంఎల్‌ఐఎస్సీ మొదటి సంవత్సరం రెండో సెమి స్టర్‌ పరీక్షలు అక్టోబర్‌ 8 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల ని యంత్రణాధికారులు ప్రొఫెసర్‌ మహేందర్‌రెడ్డి, డాక్టర్‌ సురేఖ బుధ వారం తెలిపారు. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. మధ్యా హ్నం 2 నుంచి 4 గంటల వరకు కొవిడ్‌ నిబంధనలతో నిర్వహించ నున్నట్లు వెల్లడించారు.

ఎంఈడీ రెండో సంవత్సరం పరీక్షలు మాత్రం అక్టోబర్‌ 1 నుంచే ప్రారంభమవుతాయని చెప్పారు. కొవిడ్‌ నేపథ్యం లో క్యాంపస్‌ హాస్టల్‌ విద్యార్థులకు అక్కడి కేంద్రాల్లోనే పరీక్షలు రాసే వెసులుబాటు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అయితే సంబంధిత కళా శాల నుంచి అనుమతి పత్రాన్ని నియంత్రణాధికారి కార్యాలయంలో సమర్పించి హాల్‌టికెట్‌ పొందాలని సూచించారు. మరిన్ని వివరాలు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. 

తాజావార్తలు