మంగళవారం 27 అక్టోబర్ 2020
Warangal-city - Sep 24, 2020 , 06:10:55

వరంగల్‌ తహసీల్‌లో ట్రైనీ ఐపీఎస్‌

వరంగల్‌ తహసీల్‌లో ట్రైనీ ఐపీఎస్‌

  • వ్యవసాయ మార్కెట్‌, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పరిశీలన

పోచమ్మమైదాన్‌: మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐపీఎస్‌ అధికారి సుధీర్‌ ఆర్‌ కెవెన్‌ ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించగా, ఒక రోజు శిక్షణ కోసం వరంగల్‌ తహసీ ల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా గతంలో అమలు చేసిన పాత రికార్డులు, ఆనాడు రాసిన విధానం గురించి తహసీల్దార్‌ ఎండీ ఇక్బాల్‌ ఆయనకు వివరించారు. మ్యుటేషన్‌, సాదాబైనామాలు, సర్టిఫికెట్లు, బైండోవర్‌, 144 సెక్షన్‌, పంచనామా, భూముల సర్వే, ఆన్‌లైన్‌ దరఖాస్తులు, పహాణీ, తదితర వాటి గురించి ట్రైనీ ఐపీఎస్‌ సమగ్రంగా తెలుసుకున్నారు.

అలాగే, వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లి మార్కెటింగ్‌ విధానాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం, రూ. ఐదు భోజనం తదితర వాటిని పరిశీలించారు. logo