గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Sep 24, 2020 , 06:10:46

నగరాభివృద్ధికి నిధుల వరద

నగరాభివృద్ధికి నిధుల వరద

  • రూ. 83.50 కోట్లతో పనులకు కౌన్సిల్‌ ఆమోదం
  • పీవీకి భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం
  •  కేంద్ర బిల్లును వ్యతిరేకించిన సభ్యులు
  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఘన నివాళి
  • అభివృద్ధిలో వేగం పెంచుతాం : మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు
  • సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి : ఎమ్మెల్యే నరేందర్‌
  •  హన్మకొండ అంబేద్కర్‌ భవన్‌లో ‘గ్రేటర్‌ కార్పొరేషన్‌' సర్వసభ్య సమావేశం

వరంగల్‌, సెప్టెంబర్‌23: వరంగల్‌ నగరాభివృద్ధికి గ్రేటర్‌ కార్పొరేషన్‌  పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. బుధవా రం మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అధ్యక్షతన హన్మకొండలో ని అంబేద్కర్‌ భవన్‌లో జరిగిన బల్దియా సర్వసభ్య సమావే శం రూ. 83.50 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదముద్ర వే సింది. ఈ నిధులను గ్రేటర్‌ పరిధిలోని 58 డివిజన్లకు కేటా యించారు. స్వచ్ఛ వరంగల్‌లో భాగంగా వాహనాల కొను గోలుకు కౌన్సిల్‌ పచ్చజెండా ఊపింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలని మేయర్‌ ప్రవేశపెట్టి న తీర్మానానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సమావేశం నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పా టించింది. కార్పొరేట్‌ సంస్థలకు లాభం చేకూర్చే కేంద్ర వ్యవ సాయ బిల్లును వ్యతిరేకిస్తూ 30వ డివిజన్‌ కార్పొరేటర్‌ బోడ డిన్నా తీర్మానం ప్రవేశపెట్టగా, కౌన్సిల్‌ ఆమోదించింది.  అ లాగే వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని స్వచ్ఛం దంగా కూల్చివేసినందుకు అరూరి రమేశ్‌కు అభినందనలు తెలిపింది. ఉదయం 11.53 గంటలకు ప్రారంభమైన సమా వేశం మూడు గంటల పాటు సాగింది. 41 ప్రధానమైన వా టితోపాటు టేబుల్‌ ఎజెండాలోని 40 అంశాలకు కౌన్సిల్‌ ఆమోదించింది. సభ్యుల ప్రశ్నలకు అధికారులు సమాధానా లు చెప్పారు. కమిషనర్‌ పమేలా సత్పతి సభ్యులు ప్రస్తావిం చిన ప్రధాన సమస్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

రూ. 83.50 కోట్ల పనులకు ఆమోదం

కార్పొరేషన్‌ చరిత్రలో  తొలిసారిగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. రూ. 83.50 కోట్ల పనుల కు కౌన్సిల్‌ సమావేశం పరిపాలనా అనుమతులను మంజూ రు చేసింది.  ప్రతి డివిజన్‌లో అభివృద్ధి జరిగేలా ఎజెండాను రూపొందించారు. రోడ్లు, డ్రైనేజీలు, శ్మశానవాటికల అభివృ ద్ధికి నిధులను కేటాయించారు. ముఖ్యంగా స్వచ్ఛ వరంగల్‌ గా తీర్చిదిద్దే క్రమంలో స్వచ్ఛ ఆటోలు, స్వీపింగ్‌ మిషన్లు, చెత్త తరలింపునకు టిప్పర్లు, జేసీబీలు, పారిశ్రామిక వాడల్లో రోడ్లు ఊడ్చేందుకు ప్రత్యేక యంత్రాలు, పరికరాల కొ నుగోలుకు అధిక నిధులను కేటాయించారు. రూ. 24 కోట్ల తో వాహనాల కొనుగోలుకు కౌన్సిల్‌ పరిపాలనా అనుమతు లను మంజూరు చేసింది.   

సమస్యలపై గళమెత్తిన సభ్యులు

రెండు రోజులుగా నగరంలో మున్సిపల్‌ నల్లా నీరు వాస న వస్తోందని 14వ డివిజన్‌ కార్పొరేటర్‌ బయ్య స్వామి అ న్నారు. పనిచేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేషన్‌లో సిటిజన్‌ చార్టర్‌ అమలు చేయడం లేదని 34వ డివిజన్‌ కార్పొరేటర్‌ జోరిక రమేశ్‌ అ న్నారు. నాలాల విస్తరణలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించాలని 20వ డివిజన్‌ కార్పొరేటర్‌ యెంబాడి రవీందర్‌ డిమాండ్‌ చేశారు.  కాకతీయ యూనివర్సిటీ భూ ముల్లో ప్రైవేట్‌ వ్యక్తులు నిర్మించే నిర్మాణాలకు కార్పొరేషన్‌ అనుమతులు ఇస్తోందని కార్పొరేటర్‌ జక్కుల వెంకటేశ్వర్లు ప్రస్తావించారు. నగరంలో కుక్కలు, పందుల బెడద తీవ్రం గా ఉందని 11 డివిజన్‌ కార్పొరేటర్‌ రాజేందర్‌ ప్రస్తావించా రు. విలీనగ్రామాల అభివృద్ధికి రూ. 10 లక్షల నిధులు నామినే షన్‌పై కేటాయించాలని కార్పొరేటర్‌ లింగం మౌనిక అన్నారు.

సైకిల్‌పై కౌన్సిల్‌కు వచ్చిన డిప్యూటీ మేయర్‌

డిప్యూటీ మేయర్‌ ఖాజా సిరాజుద్దీన్‌,  30వ డివిజన్‌ కా ర్పొరేటర్‌ బోడ డిన్నా సైకిల్‌పై కౌన్సిల్‌ సమావేశానికి వచ్చారు. స్మార్ట్‌సిటీలో భాగంగా ఇండియా చేంజ్‌ ఫర్‌ సైకిల్‌ చాలెంజ్‌ నిర్వ హిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వారు సైకిల్‌పై వచ్చి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం.. 


కార్పొరేషన్‌కు నిధుల కొరత లేదు. పట్ణణ ప్రగతి ద్వారా ప్రతి నెల రూ. 7.34 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు రూ. 59 కోట్లు వచ్చాయి. స్మార్ట్‌సిటీ నిధులతో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నా యి. పశ్చిమలో రూ. 65 కోట్లతో నాలుగు స్మార్ట్‌ రోడ్లు, రూ. 60 కోట్లతో తూర్పు నియోజకవర్గంలో 11 స్మార్ట్‌ రోడ్ల నిర్మాణం చే యనున్నాం. ప్రతి వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డి లక్ష్యంగా నగరంలో వెయ్యి సీట్ల సామర్థ్యం కలిగిన టాయిలెట్స్‌ పురోగతిలో ఉన్నాయి. త్వరలోనే లక్ష్యాన్ని సాధిస్తాం. అన్ని రకాల నిధులను వినియోగించుకొని నగరాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టి స్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. సుమారు రూ. 500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాం. వీటిని నగరాభివృద్ధికి ఉపయోగించుకునేలా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతాం. 

- గుండా ప్రకాశ్‌రావు, మేయర్‌

 పక్కా ప్రణాళికలతో పనులు


పక్కా ప్రణాళికలు రూపొందించుకొని నగరాన్ని సమగ్రాభివృద్ధి చే యాలి. పట్ణణ ప్రగతిలో అన్ని రకా ల అభివృద్ధి పనులను చేపడుతు న్నాం. సీఎం సూచించిన ప్రకారం శ్మశానవాటికలు, పార్కులు, మార్కెట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిధులు కేటాయించడం కాదు..

క్షేత్ర స్థాయి లో పనులు జరిగే వరకు పర్యవేక్షించాలి. మేయర్‌, కమిషనర్‌ సమన్వయంతో అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రజారోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. మిషన్‌ భగీరథ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలి. స్వచ్ఛ ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. స్వచ్ఛ ఆటోలకు  ప్రతి నెలా చెల్లించే రూ. 60 చార్జి ఆస్తి పన్నులో కలిపి వసూలు చేసేలా ఆలోచించాలి. అర్బన్‌ మలేరియా విభాగంలో దినసరి వేతనంపై పనిచేస్తున్న 90 మందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించుకోవాలి. అగడ్త రోడ్డును అభివృద్ధి చేయాలి. ఎస్సారెస్పీ కాల్వ వద్ద వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలి. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో  పనిచేస్తూ నగరాన్ని అభివృద్ధి చేయాలి.

 నన్నపునేని నరేందర్‌, తూర్పు ఎమ్మెల్యేlogo