గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Sep 22, 2020 , 02:53:29

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు

భీమారం, సెప్టెంబర్‌ 21 : రాష్ట్రంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ మత్స్యకారుల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. హసన్‌పర్తి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో సోమవారం ఉచిత చేప పిల్లలను ఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుల వృత్తుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను  అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీతారాజు, జడ్పీటీసీ సునీతా ప్రసాద్‌, కార్పొరేటర్‌ నాగమళ్ల ఝాన్సీసురేశ్‌, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పిట్టల కుమారస్వామి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు పిట్టల సదానందం, 55వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ చకిలం రాజేశ్వర్‌రావు, కందుకూరి చంద్రమోహన్‌ పాల్గొన్నారు. అలాగే, హసన్‌పర్తి మండలంలోని ముచ్చర్ల మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఊర చెరువులో ఉచిత చేప పిల్లలను కార్పొరేటర్‌ జక్కుల వెంకటేశ్వర్లు వదిలారు. కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు దామెర రాజయ్య, సభ్యులు దామెర శ్యామ్‌, విజయ్‌, శంకర్‌, ప్రసాద్‌, నాగరాజు, పౌల్‌, శ్రీధర్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు. కాగా, హసన్‌పర్తి పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నేదునూరి కుమారస్వామి తండ్రి లచ్చయ్య మృతిచెందగా బాధిత కుటుంబాన్ని  ఎమ్మెల్యే  పరామర్శించారు.    

పట్టభద్రుల ఎన్నికల్లో  సత్తాచాటాలి  

ఐనవోలు  పట్టభద్రుల ఎన్నికల్లో మన సత్తాచాటాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొల్లెపల్లి శంకర్‌రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మాట్లాడుతూ పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయాలన్నారు. అనంతరం ఓట్ల నమోదు పత్రాలను ప్రజాప్రతినిధులు, గ్రామ ఇన్‌చార్జిలకు అందజేశారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, ఎంపీపీ మార్నేని మధుమతి, జడ్పీ వైస్‌చైర్మన్‌ గజ్జెల్లి శ్రీరాములు, జడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ ఉస్మాన్‌అలీ,  రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ మజ్జిగ జయపాల్‌, వైస్‌ ఎంపీపీ తంపుల మోహన్‌, సర్పంచ్‌ జన్ను కుమారస్వామి, ఎంపీటీసీ కొత్తూరి కల్పన మధుకర్‌    

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

నయీంనగర్‌ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పిలుపునిచ్చారు. ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాసంలో హసన్‌పర్తి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇన్‌చార్జిలతో ఓటర్ల నమోదుపై అవగాహన సమావేశం నిర్వహించారు. అనంతరం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పింపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంసీపీ సునీత, జడ్పీటీసీ సునీతా ప్రసాద్‌   


logo