సోమవారం 19 అక్టోబర్ 2020
Warangal-city - Sep 22, 2020 , 02:53:43

ఆ బిల్లులు వద్దే వద్దు..!

ఆ బిల్లులు వద్దే వద్దు..!

  • రైతు నోట్లో మట్టి కొట్టేలా ‘వ్యవసాయ ఆర్డినెన్స్‌'
  • మోదీ సర్కారు తీరుపై రైతులు, కార్మికుల ధ్వజం
  • ఉమ్మడి జిల్లాలో నిరసనల వెల్లువ
  • బిల్లు ప్రతులు దహనం చేసిన రైతులు, కార్మిక సంఘాలు
  • కార్పొరేట్‌ శక్తులకు కేంద్రం కొమ్ముకాస్తున్నదంటూ మండిపాటు
  • వెంటనే ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని టీఆర్‌ఎస్‌కేవీ, ఏఐటీయూసీ, ఏఐకేఎఫ్‌ డిమాండ్‌ 

నర్సంపేట/వర్ధన్నపేట/సంగెం/పరకాలటౌన్‌: వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్కరణల పేరుతో కేంద్రప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌.. రైతుల నోట్లో మట్టి కొట్టేలా ఉందని, దానిని వెంటనే రద్దు చే యాలని ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నిరసనలు వె ల్లువెత్తాయి. ఆరుగాలం కష్టించే రైతు శ్రేయస్సు కంటే కార్పొరేట్‌ శక్తులకే మోదీ సర్కారు కొమ్ము కాస్తున్నదంటూ సోమవారం రైతులు, కార్మిక సం ఘాల నాయకులు ధ్వజమెత్తారు. బిల్లుకు వ్యతిరే కంగా సీఎం కేసీఆర్‌, ఎంపీలు చేస్తున్న పోరాటా నికి కార్మికుల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుం దని వారు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌కేవీ, ఏఐటీ యూసీ, దడువాయి, హమాలీ సంఘాల ఆధ్వ ర్యంలో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఏకపక్షంగా తెచ్చిన బిల్లుతో రాష్ట్రం లో ఉన్న 182 మార్కెట్‌ యార్డులు మూతపడి కా ర్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతారని టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు గోనె యువరాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బొంపెల్లి మునీశ్వ ర్‌, దడువాయి యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి నా యిని నర్సయ్య ఆందోళన వ్యక్తం చేశారు. వర్ధన్న పేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతులతో కలిసి ఏఐటీయూసీ నాయకు లు నిరసన తెలిపారు. కేంద్రం వెంటనే ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని ఏఎంసీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చారు. సంగెం మండలం వంజర పల్లిలో ఏఐకేఎఫ్‌(అఖిలభారత కిసాన్‌ ఫెడరేషన్‌) జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్‌ రావు ఆధ్వ ర్యంలో బిల్లు ప్రతులను తగులబెట్టారు. పరకాల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రైతు వ్యతిరేక బిల్లు ను వెంటనే రద్దుచేయాలని టీఆర్‌ఎస్‌కేవీ అను బంధ సంఘా ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి లక్ష్మ ణ్‌ డిమాండ్‌ చేశారు. అనంతరం మార్కెట్‌ సెక్రట రీకి వినతిపత్రం ఇచ్చారు.


logo