గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Sep 21, 2020 , 04:45:40

రూ. 5 లక్షల విలువైన అంబర్‌ ప్యాకెట్లు సీజ్‌

రూ. 5 లక్షల విలువైన అంబర్‌ ప్యాకెట్లు సీజ్‌

వరంగల్‌ క్రైం, సెప్టెంబర్‌ 20 : కేయూ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నిరూప్‌తండాలో కారులో నిల్వ చేసిన రూ. 5 లక్షల విలువైన అంబర్‌ ప్యాకెట్లను కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పొలీసులు ఆదివారం సీజ్‌చేశారు. ఇన్‌స్పెక్టర్‌ నందిరాంనాయక్‌ కథనం ప్రకారం.. పక్కా సమాచారంతో చింతకింది లక్ష్మీనారాయణ ఇంటి ఆవరణలో ఉన్న కారులో తనిఖీ చేయగా 10 అంబర్‌ ప్యాకెట్ల బ్యాగులు లభ్యమయ్యాయన్నారు.

లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకొని విచారించగా బీహార్‌ నుంచి తీసుకొచ్చినట్లు ఒప్పుకున్నాడన్నారు. అంబర్‌ ప్యాకెట్లతో పాటు కారును స్వాధీనం చేసుకొని కేయూ పోలీసులకు అప్పగించామన్నారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది శ్యాంసుందర్‌, సోమలింగం, సృజన్‌, రాజేశ్‌, మహేందర్‌, అలీ పాల్గొన్నారు. logo