గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Sep 21, 2020 , 04:45:40

రక్తదానం ప్రాణదానంతో సమానం..

రక్తదానం ప్రాణదానంతో సమానం..

కాశీబుగ్గ : రక్తదానం ప్రాణదానంతో సమానమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ప్రాంగణం లో ‘మన అగ్రిటెక్‌' ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ వంతుగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలన్నారు. యువకులు రక్త దానం చేయడానికి ముందుకు రావాలన్నారు.

కా ర్యక్రమంలో మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం, రెడ్‌క్రా స్‌ సొసైటీ చైర్మన్‌ నిమ్మగడ్డ వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు ఈవీ శ్రీనివాస్‌, మన అగ్రిటెక్‌ చైర్మన్‌ పాశికంటి రమేశ్‌ పాల్గొన్నారు.


logo