బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-city - Sep 21, 2020 , 04:45:38

కాలుష్య రహిత నగరంగా వరంగల్‌

కాలుష్య రహిత నగరంగా వరంగల్‌

  • ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

హన్మకొండ, సెప్టెంబర్‌ 20 : వరంగల్‌ నగరాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నా రు. ఆదివారం బల్దియా ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్‌ భవనం నుంచి కాజీపేట వరకు సైకి ల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 13 సంవత్సరాలుగా తాను ప్లాస్టిక్‌ వాడకానికి దూరంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇకపై నెలలో ఒక రోజు ఏసీ, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుల వాడకాన్ని మానేస్తానని తెలిపారు.

కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశాలకు కార్పొరేటర్లు సైకిల్‌పై రావాలని పిలుపునిచ్చారు. కాగా, కార్యక్రమంలో భాగస్వాములైన ఐటీబీపీ ఇండియా, స్మార్ట్‌సిటీ మిషన్‌, ఫిట్‌ ఇండియా, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌, స్వచ్ఛ భారత్‌ తదితర సంస్థల ప్రతినిధులను ఆయన అభినందించారు. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు మాట్లాడు తూ.. స్మార్ట్‌సిటీలో భాగంగా సైకిల్‌ ర్యాలీ ఏర్పాటు చేశామని, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, ర్యాలీని మేయర్‌, కలెక్టర్‌, కుడా చైర్మన్‌ ప్రారంభిం చారు. కార్యక్రమంలో మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, ఇన్‌చార్జి డీసీపీ పుష్ప, రెడ్‌క్రాస్‌ చైర్మ న్‌ డాక్టర్‌ పీ విజయచందర్‌రెడ్డి, ట్రెజరర్‌ నాగయ్య, రాష్ట్ర ఎంసీ మెంబర్‌ ఈవీ శ్రీనివాస్‌రావు, జిల్లా సభ్యులు డాక్టర్‌ టీ విజయలక్ష్మి, ఏసీపీ జితేందర్‌రెడ్డి, బాలస్వా మి, సీఐ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. logo