శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Sep 20, 2020 , 06:30:01

8 మంది ఎస్సైలకు ప్రమోషన్‌

8 మంది ఎస్సైలకు ప్రమోషన్‌

వరంగల్‌ క్రైం : వరంగల్‌ రేంజ్‌లోని జగిత్యాల, కరీంనగర్‌, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌, సీఐడీ విభాగంలో పనిచేస్తున్న 8 మంది ఎస్సైలకు సీఐలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ డీఐజీ పీ ప్రమోద్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వారిలో ముగ్గురు ప్రస్తుతం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆత్మకూర్‌ పీఎస్‌లో పనిచేస్తున్న రాజ్యలక్ష్మిని వరంగల్‌ పోలీస్‌ ట్రైనిం గ్‌ సెంటర్‌కు, పెనుగొండ అంజన్‌రావు, పెంచాల మధుకర్‌ను సీఐడీ విభాగానికి బదిలీ చేశారు.