శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Sep 20, 2020 , 06:29:57

నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ

నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ

సుబేదారి, సెప్టెంబర్‌ 19 : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్డీవో శ్రీనివాస్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఆర్డీఏ ఈజీఎంఎం ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఆధ్వర్యంలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన కింద పదో తరగతి చదివి, 19 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న నిరుద్యోగ యువతీయువకులకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తామన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని, సర్టిఫికెట్లతో ఈనెల 21న హసన్‌పర్తి టీటీడీసీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9441425359, 9908286479 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.