సోమవారం 19 అక్టోబర్ 2020
Warangal-city - Sep 20, 2020 , 05:53:19

ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే

ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే

  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై  సన్నాహక సమావేశాలు

హన్మకొండ/ భీమారం : రాష్ట్రంలో ఎన్నిక ఏదై నా విజయం టీఆర్‌ఎస్‌దేనని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై హన్మకొండలోని విష్ణుప్రియగార్డెన్‌, భీమారంలోని బాలాజీ గార్డెన్‌లో శనివారం నిర్వహించిన విస్తృత స్థాయి సన్నాహక సమావేశాల్లో మంత్రి సత్యవతిరాథోడ్‌తో కలిసి పాల్గొన్నారు.

హన్మకొండలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు. వైరస్‌ బాధితులకు పవర్‌ఫుల్‌ కిట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఇంట్లో ఓట్లే వేయించుకోలేని బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ప్రతిదాన్నీ రాజకీయం చేస్తూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌తో కలిసి ఎంజీఎం కరోనా వార్డును సందర్శించిన తర్వాత సీఎం మంజూరు చేసిన డబ్బుతో ఎంజీఎం రూపురేఖలే మారిపోయాయన్నారు.

మందులు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, బెడ్స్‌ కొరత లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.30కోట్లతో కేఎంసీని సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలగా మార్చామని, 350 బెడ్స్‌తో దవాఖానను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి, మిషన్‌భగీరథ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణను అణగదొక్కాలని చూస్తున్నదని, నిధుల మంజూరులో వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఆసరా పింఛన్లలో రాష్ట్ర వాటా వంద రూపాయలు అయి తే  కేంద్రం వాటా రూపాయి 80 పైసలు మాత్రమేనన్నారు. అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే పార్టీలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని, టీఆర్‌ఎస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యకర్తలు, డివిజన్‌ ఇన్‌చార్జిలు, అధ్యక్షులు, కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు చేయించాలన్నారు. ఇందుకు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, యువతలో అవగాహన కల్పించాలని సూచించారు. దాస్యం వినయ్‌భాస్క ర్‌ టీఆర్‌ఎస్‌ సైనికుడని మంత్రి కేటీఆర్‌ అంటుంటారని గుర్తుచేశారు.

రాష్ర్టానికి వెల్లువలా కంపెనీలు..

భీమారంలో బాలాజీ గార్డెన్‌లో నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గస్థాయి ఎన్నికల సన్నాహ క  సమావేశంలో మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ కేటీఆర్‌ చొరవతో రాష్ట్రానికి పెద్దఎత్తున కంపెనీలు వస్తున్నాయని వాటితో యువతకు ఉ పాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయన్నా రు. ఇన్‌చార్జిలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు న మోదు కార్యక్రమాన్ని చేయాలని సూచించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ సా గునీటిని విడుదల చేశారని, నిరంతర విద్యుత్‌ సరఫరా చేయిస్తున్నారని, పింఛన్లు, రైతు బంధు, రై తు బీమా, మిషన్‌ భగీరథ లాంటి అ నేక సంక్షేమ పథకాలు అమలు చే స్తూ రాష్ర్టాన్ని ప్రగ తిపథాన నడుపుతున్నారన్నారు.

రై తుల నడ్డి విరిచేందుకే కేంద్రం వి ద్యుత్‌ బిల్లు తె చ్చిందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మా ట్లాడుతూ ఈ ఎన్నికలను యువత ప్రతిష్టాత్మకం గా తీసుకుని టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మేయర్‌ గుండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ సూచించిన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశాల్లో కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మార్నే ని రవీందర్‌ రావు, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ ఇ న్‌చార్జిలు, అధ్యక్షులు, కార్పొరేటర్లు, పీఏసీఎస్‌ చైర్మన్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


logo