బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Sep 19, 2020 , 05:43:44

బాధ్యతలు చేపట్టిన ఏనుమాముల మార్కెట్‌ కార్యదర్శి వెంకటేశ్‌ రాహుల్‌

బాధ్యతలు చేపట్టిన ఏనుమాముల  మార్కెట్‌ కార్యదర్శి వెంకటేశ్‌ రాహుల్‌

కాశీబుగ్గ, సెప్టెంబర్‌ 18 : వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శిగా బరుపాటి వెంకటేశ్‌ రాహుల్‌(వెంకటయ్య) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇదే మార్కెట్‌లో గ్రేడ్‌-2 కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి పదోన్నతిపై ఇతర మార్కెట్లలో ఆయన పని చేశారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందంతో పాటు ఉద్యోగులు ఓని కుమారస్వామి, జన్ను భాస్కర్‌ సంకినేని శ్రీనివాస్‌, కనకశేఖర్‌, పాలకవర్గ సభ్యులు వెంకటేశ్‌ రాహుల్‌ను శాలువాతో సన్మానించి బొకే అందజేశారు. రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.logo