గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Sep 17, 2020 , 07:59:27

ఎంజీఎంలో మెరుగైన సేవలు

ఎంజీఎంలో మెరుగైన సేవలు

  • త్వరలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ విస్తరణ  పనులు పూర్తి
  • కొవిడ్‌ విభాగానికి మరో 100 పడకలు
  • అందుబాటులో 107 సిలిండర్లు
  • లక్షణాలతో వచ్చిన వారి కోసం ట్రయాజ్‌ వార్డు
  • ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ నాగార్జున్‌రెడ్డి

వరంగల్‌ చౌరస్తా, సెప్టెంబర్‌ 16: ఎంజీఎంలో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జున్‌రెడ్డి అన్నారు. బుధవా రం ఎంజీఎం ఆవరణలోని అకాడమిక్‌ హాల్‌లో కేఎంసీ ప్రి న్సిపాల్‌ డాక్టర్‌ సంధ్యతో కలిసి విలేకరుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా నాగార్జున్‌రెడ్డి మాట్లాడుతూ ఆక్సిజన్‌ సౌకర్యం కలిగిన కొవిడ్‌ 19 వార్డును మరో 100 పడకలతో మొత్తం 440 బెడ్స్‌తో సేవలు అందిస్తున్నామని అన్నారు. ఆక్సిజన్‌ ప్లాంటును రెండింతలు విస్తరిస్తున్నామని, మరో 15 రోజుల్లో పనులు పూర్తి కానున్నట్లు ఆయన తెలిపా రు. 107 గ్యాస్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచామని పే ర్కొన్నారు. గ్యాస్‌ పీడనాన్ని నియంత్రించుకునేలా త్వరలో వేపరైజర్‌ యంత్రాన్ని బిగించనున్నామని, దీంతో అన్ని పడ కలకు ఆక్సిజన్‌ ఒకే ప్రెషర్‌తో అందుతుందని అన్నారు.

ట్రయాజ్‌ వార్డు ఏర్పాటు

కరోనా లక్షణాలతో వచ్చే వారి కోసం 60 పడకలతో 24 గంటలు అందుబాటులో ఉండేలా ట్రయాజ్‌ వార్డును ఏర్పా టు చేసినట్లు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ తెలిపారు. బాధి తులు వచ్చిన వెంటనే ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేసి, పాజిటివ్‌ వస్తే కొవిడ్‌ వార్డులో చేర్చుతామని పేర్కొన్నారు. నెగెటివ్‌గా వచ్చిన వారికి తిరిగి నమూనాలు సేకరించి వైరాల జీ ల్యాబ్‌లో ఆర్‌టీపీసీఆర్‌ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహి స్తున్నామని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా మరో మారు నిర్ధారించుకున్న తర్వాత వారి అవసరానికి తగిన వార్డుకు తరలిస్తామని అన్నారు. ఈ వార్డు ద్వారా సారీ వార్డుపై ఒత్తిడి తగ్గడంతోపాటు వైద్యపరీక్షలు సైతం వెంటవెంటనే పూర్తి చేయడానికి వీలుంటుందని అన్నారు.

త్వరలో సూపర్‌ స్పెషాలిటీ సేవలు

- కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య

పీఎంఎస్‌ఎస్‌వై సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని కాకతీయ మెడికల్‌ కళా శాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య తెలిపారు. 250 పడకలతో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్‌లో 100 బెడ్స్‌ను కరోనా అవ సరాలకు వినియోగించుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ప్రస్తుతం ఎంజీఎం కొవిడ్‌ విభాగంలో పడకలు ఖాళీగా ఉండడంతో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లో కరోనా విభాగం ఏర్పాటును తాత్కాలికంగా నిలిపివేశామని అన్నా రు. త్వరలో 100 పడకలతో వైద్యసేవలు ప్రారంభించను న్నామని ఆమె తెలిపారు. ఇందులో ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పా టు పనులు జరుగుతున్నాయని, ప్రస్తుతం 60 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.


ఎంజీఎంలో కొవిడ్‌ సేవలు..

ఓపీ(ఔట్‌ పేషెంట్లు) 15968

నేటి వరకు అడ్మిషన్లు 2161

సారీ వార్డులో.. 3467

ఆర్‌టీపీసీఆర్‌ నమూనాలు 5590

పాజిటివ్‌ కేసులు 2214

ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు 660

పాజిటివ్‌ల సంఖ్య 144logo