మంగళవారం 27 అక్టోబర్ 2020
Warangal-city - Sep 15, 2020 , 07:43:17

‘నకిలీ’ డొంక కదిలింది.!

‘నకిలీ’ డొంక కదిలింది.!

  • ఆరుగురిపై కేసు నమోదు
  • ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్‌

వరంగల్‌,సెప్టెంబర్‌,14: అడ్డదారిలో ఉద్యోగంలో చేరిన వారి బాగోతం బయట పడింది. రెండేళ్ల కిత్రం నమస్తే తెలంగాణలో ‘అడ్డదారిలో ఉద్యోగాలు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అధికా రులు నకిలీ సర్టిఫికెట్ల అంశంపై విచారణ చేపట్టారు. తమ వారసులకు అడ్డదారిలో ఉద్యోగాలు ఇప్పించాలని ఆరుగురు ఉద్యోగులు వివిధ అసుపత్రుల నుంచి నకిలీ  సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఉద్యోగాలు పొందినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో బల్దియాలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం అంశాన్ని విజిలెన్స్‌ అధికారులు కొద్ది నెలల క్రితం ప్రభుత్వానికి నివేదించారు. 

ఆరుగురిపై కేసులు నమోదు

బల్దియాలో నకిలీ సర్టిఫికెట్లతో వారసులకు ఉద్యోగాలు ఇప్పించుకున్న ఆరుగురి పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ అదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో సోమవారం కార్పొరేషన్‌ అధికారులకు అదేశాలు అందాయి. నకిలీ సర్టిఫికెట్లు అందజేసిన రామగిరి కాంత, ఎస్‌. నారాయణ, ప్రేమ్‌సాగర్‌, వరమ్మ, రాజమౌళి, చీకటి సారంగపాణి ఉన్నారు. వీరితో పాటు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారసులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని అదేశాలు జారీ అయ్యాయి. వారిలో చీకటి సారంగపాణి, రాజమౌళి వారసులు ప్రస్తుతం బల్దియా లో ఉద్యోగాలు చేస్తున్నారు. మిగిలిన నలుగురు ఉద్యోగుల వారసులను అప్పటి కమిషనర్‌ వీపీ గౌతం తిరస్కరించారు. అంతా అయిపోయిందనుకున్న సమయంతో మరోసారి నకిలీ వ్యవహారం కార్పొరేషన్‌లో కలకలం సృష్టించింది. 


logo