శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Sep 13, 2020 , 02:21:34

రేషన్‌ బియ్యం లారీ పట్టివేత

రేషన్‌ బియ్యం లారీ పట్టివేత

  • 250 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
  • వీటి విలువ రూ.6.50 లక్షలు
  • డ్రైవర్‌, హమాలీ అరెస్ట్‌, పరారీలో మరో10 మంది

నర్సంపేట/ వరంగల్‌ క్రైం, సెప్టెంబర్‌ 12 : నల్లబెల్లి మం డలం నుంచి మహారాష్ట్రకు తరలించేందుకు  లారీలో బియ్యం బస్తాలను లోడ్‌చేస్తుండగా రూ 6.50లక్షల విలువైన 250 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబెల్లి మండ లం సాయిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బండ నర్సింహారెడ్డి ఇంట్లో నిల్వ చేసిన పీడీఎస్‌ బియ్యాన్ని మహారాష్ట్రకు చెందిన లారీలో లోడు చేస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నందిరాం, మధు శనివారం తెల్లవారు జామున గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో కేఏ 56-4016 నంబర్‌ గల లారీలో బస్తాలు లోడ్‌ చేస్తుండగా వాటిని పరిశీలించి పీడీఎస్‌ బియ్యంగా గుర్తించారు. లారీతో పాటు డ్రైవర్‌ నందన్‌ లాల్‌, హమాలీ ముత్తినేని సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన తూర్పాటి కిషన్‌, ములుగు మండలానికి చెందిన నరసింహులు కొంతకాలం నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని సేకరించి బండ నర్సింహారెడ్డి ఇంట్లో నిల్వ చేస్తున్నట్లు చెప్పారు. ఇలా సేకరించిన బియ్యాన్ని మహారాష్ట్రకు చెందిన లారీల్లో  తరలిస్తున్నట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా డ్రైవర్‌, హమాలీతో పాటు బియ్యం లారీని టాస్క్‌ఫోర్క్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లబెల్లి పోలీసులకు అప్పగించారు. అదేవిధంగా బియ్యం సేకరించిన 12 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తూర్పాటి కిషన్‌,  నర్సింహులు, బండ నర్సింహారెడ్డి, నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చెందిన సామల రాంబాబు, దూడల సదయ్య, సదయ్య, దూడ ల రాజు, గాదర అశోక్‌, ఖాకీ లచ్చులు,  మంక లి అశోక్‌పై కేసు నమోదు చేయగా ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నట్లు చెప్పారు.  

10 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

చెన్నారావుపేట : ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై శీలం రవి తెలిపారు. మండలంలోని కోనాపురం గ్రామంలో పల్లకొండ స్వామి ఇంట్లో అక్రమంగా రేషన్‌ బియ్యం నిల్వ చేశాడు. విశ్వసనీయ  సమాచారం మేరకు శనివారం అతడి ఇంటిపై దాడి చేసి రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించి పల్లకొండ స్వామిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది ఉపేందర్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.logo