గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Sep 13, 2020 , 02:21:48

వెల్లువెత్తిన కొత్త సంబురం

వెల్లువెత్తిన కొత్త సంబురం

  • n నూతన రెవెన్యూ చట్టంపై సర్వత్రా హర్షం
  • n కేసీఆర్‌కు జేజేలు పలికిన జనం
  • n చేలల్లో.. చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు
  • n పలుచోట్ల పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు 

నమస్తే నెట్‌వర్క్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించడంపై అన్ని వర్గాల ప్రజలు సంబురపడుతున్నారు. శనివారం కూడా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణు లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రైతులు, వీఆర్‌ఏలు, తదితరులు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వ హించారు. జై తెలంగాణ.. జైజై కేసీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రభు త్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. వీఆర్వో వ్యసస్థ రద్దు కావడం శుభపరిణామమని పేర్కొంటున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో ఎవ రూ చేయని పనిని సీఎం కేసీఆర్‌ చేశారంటూ కొనియాడారు. రైతులకు, వృద్ధులకు కనిపించే దేవుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అని పొగడ్తలతో ముంచెత్తారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పెగడపల్లి, జనగామ, బచ్చన్నపేట, ఆలింపూర్‌, లింగా ల ఘనపురం, నర్మెట, తరిగొప్పుల, మహబూబాబాద్‌, మరిపెడ, నర్సింహులపేట, ములుగు జిల్లా వెంకటాపురం, వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపే ట, ఆత్మకూరు మండలం పెద్దాపురం, గీసుగొండ మండలం గొర్రెకుంట క్రాస్‌ రోడ్డు, వరంగల్‌ అర్బ న్‌ జిల్లా హసన్‌పర్తి, టేకులగూడెం, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.logo