గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Sep 11, 2020 , 06:31:43

ఐలమ్మకు ఘన నివాళి

ఐలమ్మకు ఘన నివాళి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని గురువారం ఉమ్మడి జిల్లా అంతటా నిర్వహించారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, రజక సంఘాలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొని ఐలమ్మ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆమె ధీరత్వాన్ని గుర్తు చేసుకున్నారు. 

నర్సంపేట, సెప్టెంబర్‌ 10: వీరనారి చాకలి ఐలమ్మ 35వ వర్ధంతిని గురువారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నర్సంపేట పట్టణంలోని ఐలమ్మ విగ్రహం వద్ద రజక అభివృద్ధి సంఘం పట్టణ అధ్యక్షుడు కొల్లూరి లక్ష్మీనారాయణ అధ్యక్షతన వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజినీకిషన్‌ ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ నిజాం కాలంలో ఐలమ్మ రజాకార్లతో ఎదురొడ్డి పోరాడిన ధీరురాలని కొనియాడారు. ఆమె విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఐలమ్మ విగ్రహానికి నర్సంపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పీ గోపాల్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మునిగాల వెంకట్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు డ్యాగల శ్రీనివాస్‌, నాయిని నర్సయ్య, నాగెల్లి వెంకటనారాయణగౌడ్‌, కౌన్సిలర్లు నాగిశెట్టి పద్మప్రసాద్‌, దార్ల రమాదేవి, గందె సుజాత చంద్రమౌళి, గోల్యనాయక్‌, బానాల ఇందిరా రాంబాబు, పరికి సుజాత, శ్రీహరి, కొల్లూరి రాము, గుడికందుల సదానందం, కొల్లూరి మధుకర్‌, శ్రీనివాస్‌, పొదిల రాంచందర్‌, రాయరాకుల సారంగపాణి, వావిళ్ల మల్లయ్య జన్ను మహేందర్‌, సంతోష్‌ పాల్గొన్నారు.

శాయంపేట: మండలకేంద్రంలో ఐలమ్మ విగ్రహానికి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ శరత్‌బాబు, ఉప సర్పంచ్‌ దైనంపల్లి సుమన్‌, కొమ్ముల భాస్కర్‌, ఐలయ్య, కార్తీక్‌, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. పెద్దకోడెపాకలో జరిగిన కార్యక్రమంలో పైండ్ల భానుచందర్‌, పైండ్ల చంద్రమౌళి, వావిళ్ల రాంమల్లు, వైనాల పెద్దసమ్మయ్య, పైండ్ల సంపత్‌, సమ్మయ్య, శేఖరయ్య, సారంగం, వైనాల చిన్న సమ్మల్లు, పైండ్ల లింగయ్య, సమ్మక్క, బుచ్చమ్మ, భద్రక్క, శాంతమ్మ, రమ, ముత్యాలమ్మ, ప్రవీణ్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. శాయంపేటలో బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మారెపల్లి క్రాంతికుమార్‌ ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు. సంఘం కార్యదర్శి మారెపల్లి మనోజ్‌కుమార్‌, అంబేద్కర్‌ జాతీయ అవార్డు గ్రహీత మొగ్గం సుమన్‌, దళిత సంఘం నాయకులు అరికిల్ల దేవయ్య, బలిజ రాము పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో భూపాలపల్లి ఇన్‌చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు.

చెన్నారావుపేట: మండలకేంద్రంలోని బస్టాండ్‌ సెంటర్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతిని శివగంగ రజక యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్సై శీలం రవి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైస్‌ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, సర్పంచ్‌ కుండె మల్లయ్య, మాజీ జడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, కంది కృష్ణచైతన్య, రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగెం రమేశ్‌, మండల అధ్యక్షుడు ఉప్పుల భిక్షపతి, కార్యదర్శి బర్ల యాకయ్య, ఆర్‌ఆర్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మామిడాల రమేశ్‌, ఉప్పుల వీరస్వామి, యూత్‌ అధ్యక్షుడు చాపర్తి రాజు, ఉపాధ్యక్షుడు వైనాల రాజు, కార్యదర్శి ఉప్పుల రాజ్‌కుమార్‌, జగదీశ్‌, రంజిత్‌, వంశీ పాల్గొన్నారు.

పరకాల: ఐలమ్మ వర్ధంతిని పరకాల అమరధామంలో రజక రిజర్వేషన్‌ పోరాట సమితి జిల్లా యువజన అధ్యక్షుడు మునుకుంట్ల రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆర్‌ఆర్‌పీఎస్‌ నాయకులు నరేశ్‌, రమేశ్‌, అనిల్‌, సంతోషి పాల్గొన్నారు.

గీసుగొండ: ఎలుకుర్తిలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఐలోని అభిషేక్‌, అశోక్‌, వెంకన్న, రవి, రాజు, రఘు పాల్గొన్నారు.

వర్ధన్నపేట: మాజీ జడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎలేందర్‌రెడ్డి, కొలిపాక రాములు, మున్సిపల్‌ కమిషనర్‌ గొడిశాల రవీందర్‌, రజక సంఘం నేతలు నాగెల్లి రవీందర్‌, రెల్లి కుమార్‌, రాజన్‌బాబు, ఆరెల్లి సతీశ్‌, నాగార్జున, జన్ను నవీన్‌ పట్టణంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.

రాయపర్తి: జడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్‌, సర్పంచ్‌ గారె నర్సయ్య మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అలాగే, రజక కాలనీలో రజకులు యువజన సంఘాల నేతృత్వంలో ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఎంపీటీసీ అయిత రాంచందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎండీ నయీం, కాంచనపల్లి వనజారాణి, మచ్చ సత్యం, పురం అనిల్‌కుమార్‌, గాలిబ్‌ సాంబయ్య, మచ్చ శ్రీనివాస్‌, నేతావత్‌ కిషన్‌నాయక్‌, సంది వంశీధర్‌రెడ్డి, మచ్చ రమేశ్‌, అశోక్‌కుమార్‌, రఘు, వరుణ్‌, రాములు, విష్ణు, సచిన్‌, సుభద్ర, వెంకటమ్మ, మహాలక్ష్మి పాల్గొన్నారు.

నడికూడ: మండలకేంద్రంలో సర్పంచ్‌ ఊర రవీందర్‌రావు, తెలంగాణ రజక సంఘాల ప్రధాన కార్యదర్శి దురిశెట్టి చందు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు పోచంపల్లి రఘు, గుడికందుల శివ, ఓనపకాల శివ, రేవంత్‌, రైతుబంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్‌ నారగోని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.


logo