బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-city - Sep 10, 2020 , 04:51:04

టీఎస్‌ ఎంసెట్‌ ప్రారంభం..

టీఎస్‌ ఎంసెట్‌ ప్రారంభం..

కేయూ క్యాంపస్‌/నర్సంపేట: ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు గాను నిర్వహించే టీఎస్‌ ఎంసెట్‌-2020 బుధవారం ప్రారంభమైంది. వరంగల్‌ ఎర్రగట్టులోని అయాన్‌ ఇన్‌స్టిట్యూ ట్‌లో మాత్రమే తొలి రోజు పరీక్ష నిర్వహించారు. బుధవారం రెండు సెషన్లలో జరిగిన పరీక్షలో 500 మంది అభ్యర్థులకు గాను 464 మంది పరీక్షకు హాజరైనట్లు రీజినల్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ వై నర్సింహారెడ్డి తెలిపారు. ఈ నెల 14 వరకు జరిగే ఎంసెట్‌కు నగరంలోని ఆరు సెంటర్లు, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేటలో రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎంసెట్‌ పరీక్షకు ఒక నిమిషం నిబంధన అమలులో ఉందని, కొవిడ్‌ 19 మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాట్లు చేశామన్నారు. రోజూ ఉదయం 9 నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని నిర్వాహకులు తెలిపారు.


logo