మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Sep 09, 2020 , 04:29:13

తేనె లొలుకు తెలుగు

తేనె లొలుకు తెలుగు

  • దేశంలోనే రెండో పెద్ద భాష మనదే.. 
  • యాస, భాష కోసం కృషి చేసిన కాళోజీ
  • నేడు తెలంగాణ భాషా దినోత్సవం

  వనపర్తి విద్యావిభాగం/నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : కమ్మనైనది తెలంగాణ భాష.. ఆ భాషలో ఉన్న మాధుర్యం ఇంకే భాషలో ఉండదు. తెలుగు భాషకు జీవనాడి. అంతటి గొప్పతనం ఉన్న భాషను గుర్తు చేసుకునేందుకూ ఒక రోజు ఉందండోయ్‌.. ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 9న తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. 

తెలంగాణ తొలిపొద్దు

  సాహిత్య సాధనలో సాహసోపేతుడు కాళోజీ. కలానికే కాదు.. కారుడికి కూడా చీ.. అనని కలేజా కలిగిన వ్యక్తి ఆయన.  కాళోజీ వందో జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఆయన గొప్పతనాన్ని గుర్తించిన కేసీఆర్‌ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016 సెప్టెంబర్‌ 9న కాళోజీ 100వ జయంతి సందర్భంగా భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భాషా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తెలంగాణలో భాషా, సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన వారికి ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ నుంచి రాష్ట్రస్థాయి కాళోజీ స్మారక పురస్కారాన్ని ప్రదానం చేస్తూ వస్తున్నారు. 

అర్థవంతమైన కలయికే..

  తెలుగు భాషా అనేది ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలకు మూలం. త్రిలింగ పదం నుంచి తెలుగు పదం వెలువడిందంటారు. ఒక సంస్కృత ధాతువు నుంచి భాష జన్మించిందని, మొదట ధ్వని, శబ్దం అదే అర్థంగా మారిందని, అర్థవంతమైన కలయికే భాష అంటారు. ఒకటో శతాబ్దంలో శాతవాహన రాజు హలుడు రచించిన గాధసప్తసతి ద్వారా తెలుగు భాషా ప్రాచీనమైనదని, తొలి తెలుగు పదం నాగాబు అని 57 అక్షరాలు, 3 ఉభయ అక్షరాలు మన వర్ణమాల అని, ప్రపంచ భాషాల్లో రెండో అతిపెద్ద భాషగా.. దేశంలో హిందీ తర్వాత రెండోది గుర్తింపు పొందింది. 

“కాళోజీ గొడవ”

అవును...! ఆయనదో గొడవ...!!

ఎడతెగని వ్యంగ్య కవిత్వ అస్ర్తాలతో సామాజిక సమస్యలపై సై అని 

తన పెన్నుగన్నుతో పాలకుల తీరును ఎండగట్టిన కలం యోధుడు 

ఆయనే రమా రంగాలకు రట్టహళ్లిలో జన్మించిన కాళోజీ..

తన బలగం సమాజం పరపతి  పదునెక్కిన పదాల హోరు...

మాడపాటి, సురవర, జమలాపుర, బూర్గుల, పీ.వీ.లతో 

ఉద్యమాల ఉషస్సుతో 

రజాకార్ల మదమనచి  ఓరుగల్లు కోటపై జాతీయ జెండా ఎగురవేసి శానసనసభకు 

ఎంపికై సామాన్యుడి దేవునిగా వేషభాషజాలను తెలుగుతో తులతూగించిన కాళోజీది...

భావితరం స్మరించే పెద్ద గొడవే...! 

అవును ఆయనది సమాజ గొడవే...!!

- నారాయణదాసు మంజులాచారి

(తెలుగు అధ్యాపకురాలు)

నాగర్‌కర్నూల్‌ జిల్లా 


logo