శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Sep 09, 2020 , 03:30:39

కేటీఆర్‌కు మంత్రి సత్యవతి ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'

కేటీఆర్‌కు మంత్రి సత్యవతి ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'

మరిపెడ: టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పిలుపు మేరకు గిఫ్ట్‌ ఏ స్మైల్‌ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు అంబులెన్స్‌ల కోసం రూ. 20.50 లక్షలను అందించారు.  ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ కలిసి చెక్కును అందజేశారు. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేత


రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సత్యవతి మంగళవారం సీఎం కేసీఆర్‌ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్ఛం అందించి ఆశీర్వచనం పొందారు.logo