గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Sep 05, 2020 , 02:59:27

వన్నెచిన్నెల ‘వడ్డేపల్లి’

వన్నెచిన్నెల ‘వడ్డేపల్లి’

  • సర్కారు చొరవతో చెరువుకు సరికొత్త సొబగులు
  • ప్రకృతి సోయగాలతో రెట్టించిన అందాలు
  • ఆహ్లాదం పంచుతున్న వడ్డేపల్లి ట్యాంక్‌బండ్‌
  • మానసిక ప్రశాంతతకు దోహదం
  • సాయంత్రం వేళ సందర్శకుల తాకిడి 
  • ఆధ్యాత్మికతను వెదజల్లుతున్న సుబ్రహ్మణ్యేశ్వరాలయం

నయీంనగర్‌: గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని వడ్డేపల్లి చెరువు, సరికొత్త సొబగులు అద్దుకొని సందర్శకులను పరవశింపజేస్తున్నది. హైదరాబాద్‌కు ట్యాంక్‌బండ్‌లా.. ఓరుగల్లుకు వడ్డేపల్లి ట్యాంక్‌బండ్‌ తలమానికంలా నిలిచింది. చుట్టూ పచ్చని చెట్లు.. తివాచీ పరిచినట్లు షో, గ్రీనరీ మొక్కలు, మధ్యలో పే..ద్ద చెరు వు, కట్టపై పిల్లలు ఆడుకునేందుకు, పేదలు సేద తీరేందుకు ఏర్పాట్లు, వ్యాయామశాల.. అద్భుత కళాకృతులు.. ఇవన్నీ ప్రజలను కట్టిపడేస్తున్నాయి. సాయంత్రం వేళ ఇక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది.  


ప్రాంతమంతా పచ్చగా.. 

ఇక్కడి ట్యాంక్‌బండ్‌పై అనేక రకాల తీగ, పూల మొక్కలు, ఇతర నీడనిచ్చే మొక్కలు పెంచడంతో ఈ ప్రాంతమంతా పచ్చ గా కళకళలాడుతున్నది. చెరువు కట్టపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. చెరువు కట్టపై ఒపెన్‌ జిమ్‌ ప్రాంతం ఉదయం, సాయంత్రం సందడిగా మారుతున్నది. 

రాష్ట్ర సర్కారు చొరవతో..

వడ్డేపల్లి చెరువుపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుని సుందరీకరించారు. రూ.కోటికి పైగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడ సినిమా షూటింగ్‌లకు కూడా అనుకూలంగా మారింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో చాలామంది షార్ట్‌ ఫిలింలు తీసేందుకు వస్తున్నారు. 


logo