ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Sep 04, 2020 , 07:01:11

రేపు జయశంకర్‌ స్మారకోపన్యాసం

రేపు జయశంకర్‌ స్మారకోపన్యాసం

కేయూ క్యాంపస్‌/హన్మకొండ, సెప్టెంబర్‌ 03 : తెలంగాణ సిద్ధాంతకర్త, కేయూ మాజీ వీసీ డాక్టర్‌ కే జయశంకర్‌ 8వ స్మారక ఉపన్యాసం శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నట్లు కేయూ రిజిస్ట్రార్‌ కే పురుషోత్తం, రాజ్యసభ సభ్యుడు, జయశంకర్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ట్రస్టు కార్యదర్శి డాక్టర్‌ బండా ప్రకాశ్‌ గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఇన్‌చార్జి వీసీ డాక్టర్‌ బీ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఎంపీ డాక్టర్‌ బండా ప్రకాశ్‌, కేయూ మాజీ వీసీ ప్రొఫెసర్‌ లింగమూర్తి పాల్గొంటారని పేర్కొన్నారు. ‘కరోనా -వలస కార్మికులు-విధాన దృక్పథం’  అంశంపై టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి ప్రసంగించనున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ లింక్‌ను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు. 


logo