ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Sep 02, 2020 , 02:48:51

ప్రారంభమైన జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు

ప్రారంభమైన జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌, సెప్టెంబర్‌ 1: దేశంలోని అగ్ర శ్రేణి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వ హించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ పరీక్షలు కొవిడ్‌ నిబంధనల మధ్య మంగళవారం ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా 9.58 లక్షల మంది ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా, 660 కేంద్రాల్లో మంగళవా రం నుంచి ఈ నెల 6వరకు పరీక్షలు నిర్వహించ నున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నర్సంపేట బిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, వాగ్దేవి ఇంజినీరింగ్‌ కళా శాల, చైతన్య డిగ్రీ కళాశాల, ఎర్రగట్టులోని అయా న్‌ టెక్నాలజీ, జయ ఇంజినీరింగ్‌ కళాశాల, వరం గల్‌ వశిష్ట ఆన్‌లైన్‌ సెంటర్లలో అభ్యర్థులు మంగ ళవారం జేఈఈ(ఆర్కిటెక్చర్‌) పరీక్ష రాశారు. మంగళవారం రెండు సెషన్‌లలో జరిగిన పరీక్షలో ఉదయం 662 మందికి 486 అభ్యర్థులు, మధ్యాహ్నం 355 మందికి 267 మంది అభ్యర్థులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అభ్యర్థులు ముఖానికి మాస్కులు ధరించి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. logo