బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-city - Sep 02, 2020 , 02:49:12

కరోనా పరీక్షలు నిరంతరం..

కరోనా పరీక్షలు నిరంతరం..

  •  24 గంటలపాటు వైద్య సేవలు
  • ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో  రెండు అంబులెన్స్‌లు
  • పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి  దయాకర్‌రావు
  • మంత్రి సత్యవతితో కలిసి వైద్యాధికారులకు వాహనాల అప్పగింత
  • ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటానికి నివాళి

తొర్రూరు/పాలకుర్తి రూరల్‌, సెప్టెంబర్‌ 1: కరోనా పరీక్షలు నిరంతరం చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షే మ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. తొర్రూరు, పాల కుర్తి ప్రభుత్వ దవాఖానలకు గిఫ్ట్‌ ఏ స్మైల్‌ అంబులెన్స్‌లను మంత్రులు మంగళవారం అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బాధితులకు 24 గంటలపాటు వైద్య సహకారం కోసం ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యం లో తొర్రూరు, పాలకుర్తి ప్రభుత్వ దవాఖానల్లో అంబులెన్స్‌ లు సేవలు అందిస్తాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌, మంత్రి కేటీఆర్‌ తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 14 వాహనా లు అందుబాటులోకి తెచ్చామన్నారు. తొర్రూరు, పెద్దవంగ ర, రాయపర్తి మండలాలకు కలిపి ఒక అంబులెన్స్‌ ఉంటుం దని తెలిపారు. కరోనా సోకగానే భయపడొద్దని, ఐసొలేషన్‌ లో ఉంటూ  వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడాల ని, ఆరోగ్య పరిస్థితి విషమిస్తే వెంటనే దవాఖానలో చేరాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో కరోనాకు మంచి వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారని, దేశంలోనే అత్య ధిక టెస్టులు చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ సూచనలు, మంత్రి కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ చొర వతో రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.  కరో నా బారిన పడిన వారిలో ఆత్మైస్థెర్యం నింపాలని నేరుగా ఫోన్‌ లో మాట్లాడుతున్నామని, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాల మాటలతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారని చెప్పారు. కష్టకాలంలో ఆదుకున్న వాళ్లే నిజమైన నేతలని కొనియాడారు. అ నంతరం దవాఖానలో సేవల గురించి రోగులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటానికి తొర్రూరు, పాలకుర్తిలో మంత్రులు నివాళులర్పించారు. వివిధ హోదాల్లో ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. 

కరోనా బాధితుల కోసం ఏఈ నెల జీతం విరాళం

కరోనా బాధితుల కోసం పీఆర్‌ ఏఈ పాషా నెల జీతాన్ని విరాళంగా మంత్రి దయాకర్‌రావుకు అందజేశారు. ఈ సంద ర్భంగా ఎర్రబెల్లి ఆయనను అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో వైద్యాధికారులు దిలీప్‌కుమార్‌, మహేందర్‌, డాక్టర్‌ కోటాచలం, సుధీర్‌, జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ మంగళపల్లి శ్రీనివాస్‌, ఎంపీపీలు నల్లా నాగిరెడ్డి, బస్వ సావిత్రీమల్లేశం, జడ్పీటీసీ లు రంగు కుమార్‌, పల్ల భార్గవీసుందర్‌రామిరెడ్డి, తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్‌ మంగళపల్లి రాంచంద్రయ్య, వైస్‌ చైర్మన్‌ జినుగ సురేందర్‌రెడ్డి, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కు రాంబాబు,  గ్రంథాలయ సంస్థ జిల్లా డైరెక్టర్‌ రామిని శ్రీనివాస్‌, వైద్యులు రవిరాథోడ్‌, రామునాయక్‌, తాల్క ప్రియాంక, యామిని, స్పందన, జ్యోత్స్న, అంబిక, ఏసీపీ గొల్ల రమేశ్‌, సీఐ బానోత్‌ రమేశ్‌, తహసీల్దార్‌ విజయ్‌భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, ఈదురు ఐలయ్య, పసునూరి నవీన్‌, తీగల దయాకర్‌, సర్పంచ్‌ వీరమనేని యాకాంతారావు, టీఆర్‌ఎస్‌ నేతలు డాక్ట ర్‌ సోమేశ్వర్‌రావు, లింగాల వెంకటనారాయణగౌడ్‌, కేతిరెడ్డి సోమనర్సింహారెడ్డి, శ్రీరాం సుధీర్‌, ముత్తినేని శ్రీనివాస్‌, కౌన్సిలర్లు నట్వర్‌, నాయకులు దొంగరి శంకర్‌, కర్నె నాగరాజు, బిజ్జాల అనిల్‌, రాయిశెట్టి వెంకన్న, కాటబత్తిని రమేశ్‌, మారుజోడు సంతోష్‌కుమార్‌, వర్రె వెంకన్న పాల్గొన్నారు. 


logo