గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Sep 01, 2020 , 04:09:19

‘ప్రణబ్‌' మృతి దేశానికి తీరని లోటు

‘ప్రణబ్‌' మృతి దేశానికి తీరని లోటు

  • సంతాపం వ్యక్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి

హన్మకొండ, ఆగస్టు 31: మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ముఖర్జీ మృతి దేశానికి తీరని లోటు అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తాను ఎంపీగా ఉన్న కాలంలో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేశారన్నారు.

భారత రాష్ట్రపతిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజముద్ర వేసిన వ్యక్తిగా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి అని మంత్రి కొనియాడారు. రాష్ట్రపతిగా దేశానికి చేసిన సేవ మరువలేనిదని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండాప్రకాశ్‌ అన్నారు. కేంద్ర మంత్రిగా, లోక్‌సభ సభ్యుడిగా, రాజ్యసభ  సభ్యుడిగా పలు పదవులు చేపట్టిన మేధావి అన్నారు. 


logo