మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Sep 01, 2020 , 04:01:26

ఏసీబీకి చిక్కిన ‘వాణిజ్య’ చేపలు

ఏసీబీకి చిక్కిన ‘వాణిజ్య’ చేపలు

  • రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సీటీవో, ఎస్‌ఏ
  • జీఎస్టీ క్లియరెన్స్‌ కోసం రూ.5వేలు డిమాండ్‌
  • రూ.2వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు
  • వరంగల్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీస్‌లో కలకలం

కరీమాబాద్‌, ఆగస్టు 31 : లంచం తీసుకుంటూ వాణిజ్య పన్నుల శాఖలోని ఇద్దరు ఉద్యోగులు సోమవారం ఏసీబీ అధి కారులకు పట్టుబడ్డారు. హంటర్‌రోడ్డులోని వాణిజ్య పన్నుల శాఖ వరంగల్‌ డివిజన్‌ కార్యాలయంలో జనగామ సర్కిల్‌ డీసీటీవో జ్యోతి పని చేస్తున్నారు. ఇటీవల వరంగల్‌ అర్బ న్‌-3 సీటీవో విరమణ పొందడంతో ఆ బాధ్యతలను జ్యోతికి అప్పగించారు. ఈక్రమంలో కాంట్రాక్ట్‌ వేసేందుకు తనకు జీఎస్టీ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ కావాలని యాకయ్య అనే వ్యక్తి జ్యోతిని కోరాడు. దీంతో సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు సదరు అధికారి రూ.5వేలు లంచం డిమాం డ్‌ చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం సంబంధిత అధికారికి రూ. 2వేలు అందజేస్తుండగా జ్యోతితో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌ రయీ స్‌ పాషాను పట్టుకున్నారు. వారి నుంచి నగదును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో మిగిలిన సర్కిళ్లకు చెందిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

వెల్లువెత్తుతున్న ఆరోపణలు

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులపై కొద్ది రోజులుగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డివిజన్‌ కార్యాలయంలోని పలువురు ఉద్యోగులు ప్రతి పనికీ డబ్బు లు వసూలు చేస్తున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఆయా సర్కిల్‌కు చెందిన ఉద్యోగులు డీలర్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ శాఖ ఉద్యోగులపై పలువురు బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా వాణిజ్య పన్నుల శాఖలోని ఉద్యోగులే సహ ఉద్యోగులపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రతి పనికీ ఓ రేటు చొప్పున లంచాలు తీసుకోవడంతో కార్యాలయానికి రావాలంటే డీలర్లు ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. logo