శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Sep 01, 2020 , 04:01:19

కష్ట కాలంలోనూ పేదలకు అండగా..

కష్ట కాలంలోనూ పేదలకు అండగా..

  • చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌
  • పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌చెక్కుల పంపిణీ

నక్కలగుట్ట, ఆగస్టు 31 : కరోనా కష్టకాలంలోనూ  పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని విస్మరించని ఒకే ఒక నాయకుడు సీఎం కేసీఆర్‌ అని ప్రభుత్వ  చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్‌ భవన్‌లో పశ్చిమ నియోజక వర్గంలోని పలు డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ... కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌  పథకాల  అమలులోనూ ఉమ్మడి జిల్లా పరిధిలో పశ్చిమ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉందన్నారు. పేదవారు ఇబ్బంది పడకూడదని సంక్షిష్ట పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కార్పొరేటర్లు నల్లా స్వరూపరాణీ రెడ్డి, అరుణ శివశంకర్‌, మాధవి రెడ్డి, మిర్యాల్‌కార్‌ దేవేందర్‌, బస్కె శ్రీలేఖ, బోడ డిన్నా, కో ఆప్షన్‌ సభ్యుడు మేకల బాబురావు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.