బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-city - Aug 26, 2020 , 01:53:35

చేపలకు కేరాఫ్‌ తెలంగాణ

చేపలకు కేరాఫ్‌ తెలంగాణ

సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నదని, త్వరలోనే చేపలకు కేరాఫ్‌గా తెలంగాణ నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి చెరువులో మూడు లక్షల చేప పిల్లలను కలెక్టర్‌ నిఖిలతో కలిసి మంగళవారం విడుదల చేశారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలోనే కులవృత్తులకు గుర్తింపు లభించిందని, మత్స్యకారుల భవిష్యత్‌కు బంగారు బాటలు పడ్డాయని స్పష్టం చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన అమాత్యుడు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను దీపావళిలోగా పూర్తి చేయాలని, అలసత్వం వహించే కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. 

పాలకుర్తి రూరల్‌ : రాష్ట్రప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నదని, త్వరలోనే తెలంగాణ చేపలకు కేరాఫ్‌గా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి చెరువులో మూడు లక్షల చేప పిల్లలను మంగళవారం విడుదల చేశారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలోనే కుల వృత్తులతో పాటు సబ్బండ వర్గాల ప్రజలకు గుర్తింపు లభించిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ప్రాధాన్యమిసుతన్నదని, కరోనా కష్టకాలంలోనూ కుల వృత్తులకు చేయూతనందిస్తున్నదని చెప్పారు. కులవృత్తుల వాళ్ల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేలా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. మున్ముందు ఇతర రాష్ర్టాలకు చేపలు ఎగుమతి చేసేలా తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది రోయ్యలను కూడా పంపిణీ చేశామని, టెండర్‌ వ్యవస్థను రద్దు చేశామని తెలిపారు.  

కరోనాతో జాగ్రత్త

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. రెండు నెలలు ఓపిక పడితే భవిష్యత్‌ అంతా మనదేనన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్టు ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు లక్షల మాస్కులను పంపిణీ చేశానని, అంబులెన్స్‌ను మంజూరు చేశానని చెప్పారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. 

దీపావళిలోగా ఇండ్లు పూర్తి చేయాలి

దసరా లేదా దీపావళిలోపు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని క్యాంప్‌ కార్యాలయంలో దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల అభివృద్ధి పనులు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్‌ నిఖిలతో కలిసి అధికారులు ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు. ఆలసత్వం వహించే కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత లేదని, సమస్యలుంటే తనకు తెలియజేయాలని సూచించారు. సీసీ రోడ్లకు ఉపాధి హామీలో నిధులు మంజూరు చేస్తానన్నారు. రైతు వేదికలు, కల్లాలు, పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లతో పాటు వరద నష్టాలను అంచనా వేయాలన్నారు.  

ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

ఎరువులు అధిక ధరలకు అమ్మినా, ధరల పట్టికల సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోయినా దుకాణాలను సీజ్‌ చేసి యజమానులపై కేసులు నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయ, పోలీస్‌, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు.  సోమవారం మండల కేంద్రంలో ఎరువుల దుకాణదారులు, రైతుల మధ్య జరిగిన గొడవను ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల మందులు, గుళికలు, రసాయనాలు కొంటేనే రైతులకు ఎరువులు అమ్ముతున్న ట్లు ఆరోపణలు వస్తున్నాయని, నియోజకవర్గంలోని అన్ని ఎరువుల దుకాణాల యజమానులు అధిక ధరలకు ఎరువుల అమ్ముతున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇలాంటి వాళ్లను ఉపేక్షించ వద్దని సూచించారు. కార్యక్రమాల్లో జిల్లా మత్య్సశాఖాధికారి శ్రీపతి, ఆర్డీవో మధుమోహన్‌, హౌసింగ్‌ ఈఈ దామోదర్‌రావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ అల్లమనేని నాగేందర్‌రావు, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, ఏసీపీ గొల్ల రమేశ్‌, ఏడీఏ టీ రాధికారావు, తహసీల్దార్‌ ఎన్‌ విజయభాస్కర్‌, ఎంపీడీవో వీ ఆశోక్‌కుమార్‌, అధికారులు శ్రీనివాసరావు, జీవన్‌ కుమార్‌, శంకర్‌రావు, సంధ్య, దిలీప్‌, ఎంపీపీలు నల్లా నాగిరెడ్డి, జ్యోతి, బస్వ సావిత్రి, జడ్పీఫ్లోర్‌ లీడర్‌ పుస్కూరి శ్రీనివాసరావు, జీసీసీ మాజీ చైర్మన్‌ ధరావత్‌ మోహన్‌గాంధీనాయక్‌, పాలకుర్తి సర్పంచ్‌ వీరమనేని యాకాంతారావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బొబ్బల ఆశోక్‌రెడ్డి, మండల కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ సర్వర్‌ఖాన్‌, బుస్సా మల్లేశ్‌, చిక్కుడు రాములు, మాచర్ల ఎల్లయ్య, తరాల చంద్రబాబు, దాసరి మధు, తీగల దయాకర్‌, పాషా, సావంత్‌, వర్రె వెంకన్న, డాక్టర్‌ యామిని, సుమన్‌, జవహార్‌, మేడారపు సుధాకర్‌, సీఐ బానోతు రమేశ్‌, ఏవో మురళీమోహన్‌, ఎస్‌ఐలు గండ్రా తి సతీశ్‌, కే సతీశ్‌. రామారావు, ఏఈఓలు పాల్గొన్నారు.


logo