గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Aug 24, 2020 , 03:49:32

కొలువుదీరిన గణనాథులు

కొలువుదీరిన గణనాథులు

  • కరోనా ఎఫెక్ట్‌తో నిరాడంబరంగా నవరాత్రి ఉత్సవాలు
  • భారీగా తగ్గిన మండపాలు
  • మట్టి వినాయకులకు పెరిగిన ఆదరణ
  • ఇంటి పట్టునే పూజలకు ప్రాధాన్యం


నమస్తే నెట్‌వర్క్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం గణనాథులు కొలువయ్యారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు తమ తమ ఇళ్లలోనే గణపతులను ప్రతిష్ఠించుకుని ప్రత్యేక పూజ లు నిర్వహించుకున్నారు. కరోనా వ్యాప్తిని కొంతైనా నివారించేందుకు ప్రభుత్వాలు పండుగలను ఎలాంటి ఆడంబరాలు లేకుండా జరుపుకోవాలని కోరాయి. దీంతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎప్పుడూ లేనం తగా వరద చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో నిర్వాహకులు మండపాలు ఏర్పాటు చేసి విఘ్నేశ్వరుడికి పూజలు జరిపారు.

శానిటైజర్లు, మాస్కులు కూడా ఉత్సవ కమిటీలు అందుబాటులో ఉంచాయి. పల్లె, పట్నం తేడా లేకుండా ఎలాంటి ఆర్భాటాలు, మైకులు లేకుండా నిరాడంబరంగా పండుగను జరుపుకున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలతో మండపాలు పెట్టక పోవడంతో కాలనీలన్నీ చిన్నబోయాయి. మార్కెట్లలో సందడి లేదు. ఇండ్లలోనే చిన్నచిన్న గణపతులు పెట్టుకునేందుకు ప్రజలు పూలు, పూజ సామగ్రి కొనుగోలు చేశారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో జనంలో అవగాహన పెరిగి ఎక్కువగా మట్టి వినాయకులనే ప్రతిష్ఠించారు. 


logo