గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Aug 18, 2020 , 02:48:01

నాలాలపై నజర్‌

నాలాలపై నజర్‌

 • చెరువు శిఖాల్లో అక్రమ నిర్మాణాలపై సర్కారు ప్రత్యేక దృష్టి 
 • వరంగల్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష
 • నేడు మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన చేసే అవకాశం 
 • రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్‌ శాఖల నేతృత్వంలో క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశాలు
 • ఇప్పటికే కూల్చివేతలు షురూ 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మునుపెన్నడూ లేనివిధంగా వరంగల్‌ మ హానగరంలో పదుల సంఖ్యలో కాలనీలు భారీ వరదలతో అతలాకుతలమయ్యాయి. వాన తగ్గినా వరద తగ్గని దయనీయ పరిస్థి తి నెలకొన్నది. నగరంలోని అనేక కాలనీలు మూడు రోజులుగా నదులను తలపిస్తున్నా యి. ప్రభుత్వం వరద సహాయక, పునరావాస చర్యలు వేగవంతంగా తీసుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. వానలు తగ్గినా ఇం కా అనేక కాలనీలు వరదల్లోనే చిక్కుకోవ డం వెనుక ఉన్న నేపథ్యాన్ని సర్కార్‌ సీరియస్‌గా తీసుకున్నది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్‌లో పునరావృతం కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నది. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట పట్టణాల్లో నెలకొన్న పరిస్థితిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌, ఎమ్మెల్యే లు సమాలోచన చేశారు. కలెక్టర్‌, మున్సిప ల్‌ కుమిషనర్‌ సహా సిటీ ప్లానర్‌తో ఉన్నతస్థాయిలో సమీక్షించారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌ లో వరంగల్‌పై సుదీర్ఘంగా సమీక్షించారు. పరిస్థితిని అంచనా వేసేందుకు మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ సహా జిల్లా మం త్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలెక్టర్లతో సమీక్షించాలని ఆదేశించా రు. దీంతో నేడు మంత్రుల బృందం వరంగల్‌కు రానున్నది. పరిస్థితిని సమీక్షించి శా శ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై విధాన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. 

 • ఆక్రమణలపై దృష్టి.. 
 • వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో దశాబ్దాలుగా ఇష్టారీతిగా చెరువులు, కుంటలను ఆక్రమిం చి కాలనీలు వెలిశాయి. చెరువు శిఖాల్లోనే కాకుండా చెరువుల్లోనూ అక్రమ నిర్మాణా లు చేపట్టారు. దీంతో నీటి ప్రవాహానికి వి ఘాతం కలిగి ఇంతటి విపత్తు ముంచుకొచ్చిందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తున్నది. వడ్డెపల్లి, భద్రకాళీ, చిన్నవడ్డెపల్లి, ఉర్సు రంగసుముద్రం, బెస్తం చెరువు ల అలుగు పారక నాలాలు ఆక్రమణలకు గురికావడం వల్లే ఈ దుస్థితి నెలకొన్నదని, ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తున్నది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌ ఆది, సోమవారాల్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలోనే కాకుండా సోమవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలోనూ నాలాలు, చెరువు శిఖాల ఆక్రమణల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొనడం విశేషం. నాలాలపై అక్రమంగా ఇండ్లు కట్టుకోవడం, చెరువులు, శిఖాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్ట డం వల్లే మునుపెన్నడూ లేని వరద ముం పునకు కారణమైందని, వీటన్నింపైనా సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ఈ అక్రమ నిర్మాణాలు కొత్తవి కావని, 40 ఏళ్లుగా ఇష్టారీతి గా నిర్మాణాలు చేపట్టినా నాటి ప్రభుత్వాలు పట్టించుకోక ఈ నష్టానికి కారణమయ్యాయని పేర్కొనడం గమనార్హం. రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన పట్టణ ప్రగతి ద్వారా నాలాలను శుభ్రం చేయడం వల్ల కొంత నష్టాన్ని తగ్గించగలిగామని చీఫ్‌విప్‌ దాస్యం పేర్కొన్నారు. ములుగురోడ్డు, చిన్నవడ్డెపల్లి, కాకతీయకాలనీలోని 12 అక్రమ నిర్మాణాలను ఇప్పటికే అధికారులు తొలగించారు. ములుగురోడ్డు టింబర్‌ డిపో, వెంకటేశ్వర గార్డెన్స్‌ ప్రహరీ గోడలను కూల్చివేశారు. కాశిబుగ్గ, కాజీపేటలోనూ నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించారు.  
 • మంత్రి కేటీఆర్‌ నేడు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం!
 • మహానగర పాలక సంస్థ పరిధిలో183 స్లమ్స్‌ ఉన్నాయి. ఇవన్నీ నీటమునిగాయి. బహుళ అంతస్థులున్న అనేక కాలనీలు సైతం వరదలో చిక్కుకున్నాయి. భద్రకాళీ, వడ్డెపల్లి చెరువు శిఖాలు, ఎఫ్‌టీఎల్‌ పరిధి లో, నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలపై మంత్రి కేటీఆర్‌ నేడు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు సూచనప్రాయంగా పేర్కొన్నాయి.   కుంచించుకుపోయిన నాలాలపై ఉన్న నిర్మాణాలె న్ని? గొలుసుకట్టు చెరువులు, వాటి కింది ప్రాంతాల పరిస్థితేమిటి? వడ్డెపల్లి, భద్రకాళీ చెరువుల ప్రధాన నాలాలు కుంచించుకుపోవడానికి కారణాలేమిటీ? వరంగల్‌లో భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండాఎలాంటి చర్యలు తీసుకోవాలో కేటీఆర్‌ వెల్లడించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలుపడం గమనార్హం.  
 • అక్రమ నిర్మాణాలు గుర్తించాలి..
 • ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ సూచన
 • రెడ్డికాలనీ : కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఎమ్మెల్యేలకు సూచించారు. నగరంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, నన్నపునేని నరేందర్‌తో సోమవారం వినోద్‌కుమార్‌ ఫోన్‌లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. ముఖ్యంగా నాలాలపై అక్రమ నిర్మాణాలను గుర్తించాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.


logo