శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Aug 16, 2020 , 03:33:48

ప్రభుత్వంపై దుష్ప్రచారం వద్దు

ప్రభుత్వంపై దుష్ప్రచారం వద్దు

n కరోనా బాధితులకు అండగా సర్కారు

n అందుబాటులో సరిపడా బెడ్లు, మందులు

n మీడియాతో మంత్రి దయాకర్‌రావు

వరంగల్‌రూరల్‌- నమస్తేతెలంగాణ : కరోనా విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని ధ్వజమెత్తారు. ‘చేతులెత్తి మొక్కుతున్నా సూచన లు చేయండి.. అంతేకానీ తప్పుడు ప్రచారం చేయవద్దు’ అని అన్నారు. శనివారం వరంగల్‌రూరల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి మీడి యాతో మాట్లాడారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై దు ష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష పార్టీల తీరును తూర్పారపట్టారు. కరో నా నివారణ చర్యలపై మొదట తప్పుడు సమాచారం అందడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం, హైకోర్టు ప్రస్తుతం వాస్తవాలతో కూడిన నివేదిక అందగానే అభినందిస్తున్నాయన్నా రు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, అవసరమైన పీపీఈ కిట్లు, మందులను సరఫరా చేసిందని చెప్పారు. వైద్యం అందించేందుకు ప్రభుత్వం సరిపడా బెడ్లను అందుబాటులోకి తెచ్చింద న్నారు. వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానలో బెడ్ల సంఖ్య పెంచిన ట్లు తెలిపారు. ప్రైవేటు దవాఖానల్లో రిజక్ట్‌ చేసిన పేషంట్లు ఎంజీ ఎంలో వైద్య సహాయం పొందుతున్నారని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో ప్రైవేటు వైద్యశాలల్లోని బెడ్లను సైతం ప్రభుత్వం తీసుకుని కరోనా బాధితులకు వైద్య సేవలందించనుందని స్పష్టం చేశారు. కాంట్రాక్టు పద్దతిన డాక్టర్లు, సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారని వెల్లడించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్‌, బీజేపీ పేర్కొంటున్నాయని, ఆరోగ్యశ్రీ కంటే ఎక్కువ వైద్య సేవలు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా బాధితులకు వైద్య సేవలందించడంలేదని దయాకర్‌రావు అన్నారు. 

దశలవారీగా పల్లెల ప్రగతి

పల్లెల సమగ్ర ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా అభివృద్ధి  పనులు చేపడుతున్నట్లు మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. వరంగల్‌రూరల్‌ జిల్లాలోని మెగా టెక్స్‌టైల్‌ పార్కు పనులు త్వరలో ఊ పందుకోనున్నాయని, ఏడాదిలోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో రూ.25 కోట్లతో 40 వేల మెట్రిక్‌ టన్నుల గోదాములు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని అన్నా రు.  జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, ఎంపీలు పసునూరి దయాకర్‌, బండా ప్రకాశ్‌, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌, జిల్లా కలెక్టర్‌ ఎం హరిత, అదనపు కలెక్టర్‌ ఆర్‌ మహేందర్‌రెడ్డి, వరంగల్‌రూరల్‌ ఆర్డీవో మహేందర్‌జీ సమావేశంలో పాల్గొన్నారు.