శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Aug 16, 2020 , 03:33:46

క్లిష్ట సమయంలో పథకాల అమలుకు నిధులు

క్లిష్ట సమయంలో పథకాల అమలుకు నిధులు

  • ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

హన్మకొండ : కరోనా కష్టకాలంలోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ కొనియాడారు. వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ ఆవరణలో జా తీయ జెండాను ఎగరేసిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, కలెక్టరేట్‌లో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేసి అమలు చేసిన పథకాలను దేశానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు స్వాత్రంత్య దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా జరుపుకొంటున్నామని చెప్పారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న వైద్యులను, మున్సిపాలిటీ, రెవెన్యూ, పారా మిలిటరీ, శానిటేషన్‌ శాఖల అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జలమయమైన లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆదుకుంటామన్నారు. కలెక్టర్‌తో కలిసి ఈ-ఆఫీస్‌ను ప్రారంభించారు. గౌరవ డాక్టరేట్‌ పొందిన ఎంపీ పసునూరి దయాకర్‌ను సన్మానించారు. వేడుకల్లో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు, నగర కమిషనర్‌ పమేలా సత్పతి, ఎంపీ పసునూరి దయాకర్‌, నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.