బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Aug 16, 2020 , 03:28:17

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు

  • కరోనా కారణంగా నిరాడంబరంగా 74వ స్వాతంత్య్ర దిన వేడుకలు
  • రూరల్‌ జిల్లాలో రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి 
  • మహబూబాబాద్‌లో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి 
  • జనగామలో మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు
  • అర్బన్‌ జిల్లాలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌
  • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మండలి విప్‌ టీ భానుప్రసాదరావు
  • ములుగు జిల్లాలో మండలి విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు
  •  గౌరవవందనం సమర్పించిన పోలీసులు

నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌ : 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కొవిడ్‌-19 దృష్ట్యా పంద్రాగస్టు వేడుకలను కలెక్టరేట్ల ఆవరణల్లో నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్‌ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్‌, జనగామలో మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, అర్బన్‌లో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, జయశంకర్‌ భూపాలపల్లిలో మండలి విప్‌ టీ భానుప్రసాదరావు, ములుగులో మండలి విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు ఉదయం 10గంటలకు జాతీయ జెండాలను ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరించారు.        


logo