ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Aug 15, 2020 , 02:39:48

బాలాజీ రోబో సాండ్‌ ప్లాంట్‌ ప్రారంభం

బాలాజీ రోబో సాండ్‌ ప్లాంట్‌ ప్రారంభం

శాయంపేట, ఆగస్టు 14 : మండలంలోని గోవిందాపూర్‌ శివారులో బాలాజీ రోబో సాండ్‌ తయారీ ప్లాంట్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం ప్రారంభించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణలోనే ప్రప్రథమంగా ఇసుక త యారీ చేసే ఈ ప్లాంట్‌ను రాజ్యసభ స భ్యుడు బండా ప్రకాశ్‌, భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతితో కలిసి మంత్రి ప్రారంభించారు. లండన్‌ నుంచి దిగుమతి చేసుకున్న సరికొత్త టెక్నాలజీతో కూడిన యంత్రంతో నాణ్యమైన ఇసుక ను తయారీ చేస్తున్నట్లు  బాలాజీ రోబో సాండ్‌ సంస్థ నిర్వాహకులు తెలిపారు. నూతన సాంకేతిక పద్ధతుల్లో ఇసుక తయారీ చేయడం ద్వారా నిర్మాణాల్లో ఇసుక ఖర్చు భారీగా తగ్గుతుందన్నారు. గోదావరి ఇసుకతో పోల్చితే నాణ్యంగా ఉంటుందని, ధర మూడో వంతు మా త్రమే ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో గండ్ర భూపాల్‌రెడ్డి, గండ్ర గౌ తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo