గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Aug 15, 2020 , 02:39:48

కరోనా కట్టడికి రాజీలేని పోరాటం

కరోనా కట్టడికి రాజీలేని పోరాటం

  • n ఎంజీఎంలో కరోనా బాధితులకు 600 పడకలు 
  • n 117 మంది రెసిడెంట్‌ డాక్టర్లకు పోస్టింగ్‌
  • n మరో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు
  • n 21 సీసీ కెమెరాలతో కొవిడ్‌ వార్డుపై నిరంతర నిఘా 
  • n నిధుల కొరత లేదు.. నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలి 
  • n రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • n ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం 

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఎంజీఎం, పీఎంఎస్‌ఎస్‌వై వైద్యశాలల్లో సమస్యలు, రోగులకు అందుతున్న సేవలు, ఇతర అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి హన్మకొండ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంజీఎంలో కొవిడ్‌ బాధితులకు అన్ని సౌకర్యాలూ కల్పించామని, నిధులు, వైద్యులు, సిబ్బంది కొరత లేదని వెల్లడించారు. 600 పడకలను కరోనా రోగుల సేవకే వినియోగించుకునేలా చూస్తున్నామన్నారు. 5వేల పీపీఈ కిట్లు, 20వేల ఎన్‌-95మాస్కులు, 200 రెమ్డెసివిర్‌ ఇంజక్షన్లు, 4వేల ఫావిపిరావిర్‌ మాత్రలను అందుబాటులో ఉంచామని, ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని అభయమిచ్చారు.