మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Aug 15, 2020 , 02:39:46

పంద్రాగస్టుకు ఏర్పాట్లు

పంద్రాగస్టుకు ఏర్పాట్లు

  • కరోనా కారణంగా కలెక్టరేట్ల ఆవరణల్లో సాదాసీదాగా..
  • నేడు ఉదయం 10గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ
  • ముఖ్య అతిథులుగా మంత్రులు, ప్రభుత్వ విప్‌లు

నమస్తే, నెట్‌వర్క్‌ : 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరు జిల్లాల్లో కరోనా దృష్ట్యా సాదాసీదాగా వేడుకలు నిర్వహించనున్నారు. శనివా రం ఉదయం 10 గంటలకు రూరల్‌ జిల్లా కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జాతీ య పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. కలెక్టర్‌ హరిత, సిబ్బంది పాల్గొంటారు. మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ ఆవరణలో రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ జాతీయ జెండా ఎగురేస్తారు. సమావేశ మందిరంలో కలెక్టరేట్‌ ఉద్యోగులతో సమావేశం కానున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో వేడుకలకు స్వాతంత్య్ర సమరయోధులు, వీఐపీలు, ప్రజలకు ఆహ్వానం లేదు. అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఎగురేయనున్నారు. జనగామ కలెక్టరేట్‌ ఆవరణలో మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు జెండాను ఆవిష్కరిస్తారు. 10.15గంటలకు తేనీటి విందులో పాల్గొంటారు. భూపాలపల్లి కలెక్టరేట్‌ ఆవరణలో ప్రభుత్వ విప్‌ టీ భానుప్రసాద్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు కలెక్టరేట్‌ ఆవరణలో మండలి విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. 


logo